Rajamouli Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ చనిపోయిన సందర్భంగా ఈ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ప్రచారాన్ని చేపట్టిన పార్టీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఈరోజు ఎలక్షన్స్ ను సైతం చాలా సవ్యంగా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలామంది సినిమా సెలబ్రిటీలు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే దర్శక ధీరుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి సైతం తన ఓటు ను వినియోగించుకున్నాడు. ఆయన ఓటు వేసిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి. నిజానికి రాజమౌళి ఎవరికి ఓటు వేశాడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.
చాలామంది రాజమౌళి మాగంటి గోపీనాథ్ కి చాలా సన్నిహితులు కావడంతో మాగంటి సునీత గారికి ఓటు వేశారని కొంతమంది అంటున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం ఆయనకి బిజెపి అంటే ఇష్టమని బిజెపి అభ్యర్థి అయిన దీపక్ రెడ్డికి ఓటు వేశారు అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా భారతీయ పౌరుడిగా ఉన్నందుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం నైతిక బాధ్యత అంటూ రాజమౌళి కూడా గతంలో చాలామందిని మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు.
మొత్తానికైతే తన ఓటు హక్కును వినియోగించుకొని తను కూడా ఒక బాధ్యత గల పౌరుడిని అని నిరూపించుకున్నాడు. ఇక తనతో పాటు తన భార్య అయిన రామ రాజమౌళి కూడా తన ఓటుని వినియోగించుకోవడం విశేషం…ఇక రాజమౌళి అటు సినిమాల్లో రాణిస్తూనే ఓటు వేసి తన నైతిక బాధ్యతను నిర్వర్తించి నలుగురికి ఆధారంగా నిలుస్తున్నాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈనెల 15 వ తేదీన మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వడానికి ఆయన పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి ఆ సినిమా బిజీలో ఉన్నాడు…అంత బిజీలో ఉన్నప్పటికి తన ఓటును వినియోగించుకున్నాడు. మనలో చాలామంది ఓటు వేయడం ఎందుకు అని నిర్లక్ష్యంతో ఓటు వేయడానికి ఇష్టపడరు. కానీ మనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి మన నైతిక బాధ్యతను నిర్వర్తించడం మన కర్తవ్యం…