Visakhapatnam: విశాఖలో( Visakhapatnam) గోమాంసం కలకలం సృష్టించింది. ఓ కోల్డ్ స్టోరేజ్ లో టన్నులకొద్ది గోమాంసం లభ్యమయింది. భారీ స్థాయిలో గోమాంసం పట్టుబట్టడంతో ధార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడి కోల్డ్ స్టోరేజ్ గా ప్రచారం సాగుతోంది. సోమవారం ఉదయం డిఆర్ఐ అధికారులు ఈ మాంసం వ్యవహారాన్ని గుర్తు రట్టు చేశారు. మొత్తం లక్ష 89 వేల కిలోల గోమాంసం పట్టుబడినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రధాన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడిది ఈ గోడౌన్ అని తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతటా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
* లక్షల కిలోలు పట్టివేత..
ప్రస్తుతం విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్( executive capital) గా మారుతుంది. రెండు రోజుల్లో పెట్టుబడుల సదస్సు జరగనుంది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో లక్షల కిలోల గో మాంసం దొరకడం సంచలనంగా మారుతుంది. గత కొద్దిరోజులుగా విశాఖ కేంద్రంగా గోమాంసం అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో శొంట్యాం సమీపంలోని మిత్ర కోల్డ్ స్టోరేజీలో భారీగా గోమాంసం నిల్వ ఉంచిన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తనిఖీలు జరిపి సుమారు 1.89 లక్షల గో మాంసాన్ని సీట్ చేశారు. ఈ ఘటనతో విశాఖపట్నం ప్రజలు షాక్ కు గురయ్యారు. అనంతపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
* ఎమ్మెల్యే అనుచరుడిదంటూ ప్రచారం..
అయితే ప్రధానంగా ఈ కోల్డ్ స్టోరేజ్( cold storage) అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడిది అని తేలింది. ఇతర జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు ఇక్కడ గత కొద్ది రోజులుగా కోల్డ్ స్టోరేజీ నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్ద ఎత్తున గోమాంసం అక్రమ రవాణా నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. గోవులను వధించడమే కాదు.. లక్షల కిలోల మాంసాన్ని ఇంత పెద్ద స్థాయిలో నిల్వ చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. కోల్డ్ స్టోరేజ్ యజమానులతో పాటు సంబంధిత వాహనదారులను విచారిస్తున్నారు. కొద్ది రోజుల కిందటే అనకాపల్లి జిల్లాలో గోవుల అక్రమ రవాణా పై ఫిర్యాదులు అందాయి. అది మరువక ముందే ఇక్కడ ఏకంగా టన్నుల కొద్దీ గో మాంసం పట్టుబడటం సంచలనంగా మారింది.
Arrest @PawanKalyan immediately !
— YSRCP Europe (@YSRCPEurope) November 10, 2025