Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ రియాలిటీ షో అతి త్వరలో ప్రారంభం కానుంది. సరికొత్త హంగులతో సీజన్ 8 సిద్దమవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై ఫుల్ బజ్ క్రియేట్ అయింది. సెప్టెంబర్ 8వ తేదీన గ్రాండ్ గా లాంచింగ్ ఎపిసోడ్ నిర్వహించనున్నారని సమాచారం. కింగ్ నాగార్జున సీజన్ 8 కి సైతం హోస్ట్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ సీజన్లో అడుగుపెడుతున్న కంటెస్టెంట్స్ విషయంలో రోజుకో వార్త వైరల్ అవుతుంది.తాజాగా ఓ క్రేజీ హీరో సీజన్ 8 కంటెస్టెంట్ గా ఎంపిక అయ్యాడంటూ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
బిగ్ బాస్ షో అత్యంత పాపులారిటీ కలిగిన రియాలిటీ షో. గత సీజన్ ఉల్టా పుల్టా అంటూ అడుగడుగునా సర్ప్రైజ్ లు, ట్విస్టులతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఫలితంగా సీజన్ 7 గొప్ప ఆదరణ దక్కించుకుంది. బెస్ట్ సీజన్ గా నిలిచింది. ఈసారి అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుందని హోస్ట్ నాగార్జున హైప్ పెంచేస్తున్నాడు.
ఊహించని ట్విస్ట్ లు ఉంటాయని .. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ ప్రోమోలో నాగార్జున చెప్పిన మాటలు బీబీ లవర్స్ లో జోష్ నింపుతున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ రీతూ చౌదరి, యాదమ్మ రాజు, కిర్రాక్ ఆర్పీ, యూట్యూబర్ బంచిక్ బబ్లు, అంజలి పవన్, యాస్మీ గౌడ, సీనియర్ నటి సన, తేజస్విని గౌడ.
రింగ్ రియాజ్, జబర్దస్త్ పవిత్ర, హీరో అబ్బాస్, సింగర్ సాకేత్, అక్షిత, ప్రేరణ, వేణు స్వామి, కుమారి ఆంటీ వంటి సెలెబ్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే ఓ హీరో పేరు తెరపైకి వచ్చింది. అతను హౌస్ లోకి వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు .. ఇటీవల యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న కమెడియన్ కమ్ హీరో అభినవ్ గోమఠం.
సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో అభినవ్ కి ఫుల్ పాపులారిటీ దక్కింది. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో అని అభినవ్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. తన ట్రేడ్ మార్క్ డైలాగ్ తో వచ్చిన ‘ మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా ‘ సినిమాలో హీరోగా నటించాడు. ఇక రీసెంట్ గా మై డియర్ దొంగ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేశాడు. అలాగే క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు బిగ్ బాస్ 8 లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని సమాచారం.
అభినవ్ గోమఠం క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నారట. ఆయన్ను తాజాగా టీం సంప్రదించినట్లు సమాచారం. అభినవ్ గనుక ఆఫర్ ఒకే చేస్తే ఇక బిగ్ బాస్ హౌస్ లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పక్కా. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.