Sandeep Reddy Vanga: మహేష్ బాబు తో సినిమా తీసే ఉద్దేశ్యం ఇప్పట్లో లేదంటూ సందీప్ వంగ సెన్సేషనల్ కామెంట్స్ !

మహేష్ బాబు కి కూడా ఆ కథ వినిపించగా అది ఎంతో నచ్చింది. కానీ ఆ తర్వాత మహేష్ తన ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అవ్వడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళింది. ఈ 'డెవిల్' స్క్రిప్ట్ లో హీరో క్యారక్టర్ 'ఎనిమల్' చిత్రంలో కంటే క్రూరంగా ఉంటుందట.

Written By: Vicky, Updated On : August 18, 2024 4:53 pm

Sandeep Reddy Vanga

Follow us on

Sandeep Reddy Vanga: ‘పోకిరి’ ప్రభావం కారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ని అభిమానులు అదే తరహా హీరోయిజం చేస్తే చూడాలని నిరంతరం పరితపిస్తూ ఉంటారు. కానీ మహేష్ బాబు ఎక్కువగా తన మనసుకు నచ్చిన సినిమాలనే చేస్తూ వచ్చాడు. అలా చెయ్యడం వల్లే నేడు ఆయన ఈ స్థాయిలో ఉన్నాడు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను చేసి టాలీవుడ్ స్టాండర్డ్స్ ని పెంచిన హీరోలలో ఒకరు ఆయన. అంతే కాదు టాలీవుడ్ ఆడియన్స్ సినిమా చూసే ఆలోచన విధానాన్ని కూడా మహేష్ తన సినిమాలతో మార్చేశాడు. కానీ ఆయన నుండి అభిమానులు మాత్రం కేవలం పోకిరి, బిజినెస్ మెన్ లాంటి పీక్ హీరోయిజం ఉన్న సినిమాలనే కోరుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ అత్యంత బోల్డ్ డైరెక్టర్ గా, ఊర మాస్ హీరో క్యారెక్టర్స్ ని డిజైన్ చేసే హీరోలలో ఒకడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి చిత్రం కంటే ముందే ఆయన మహేష్ బాబు తో ‘డెవిల్’ అనే స్టోరీతో సినిమా చెయ్యాలని అనుకున్నాడు.

మహేష్ బాబు కి కూడా ఆ కథ వినిపించగా అది ఎంతో నచ్చింది. కానీ ఆ తర్వాత మహేష్ తన ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అవ్వడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళింది. ఈ ‘డెవిల్’ స్క్రిప్ట్ లో హీరో క్యారక్టర్ ‘ఎనిమల్’ చిత్రంలో కంటే క్రూరంగా ఉంటుందట. మహేష్ బాబు కి ఇలాంటి క్యారక్టర్ పడితే మా ఆకలి తీరుతుంది అని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే సందీప్ వంగ ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ తో చేయబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేసే సమయం నాకు లేదు. రేపు ప్రభాస్ తో తియ్యబోయే ‘స్పిరిట్’ తర్వాత ‘ఎనిమల్ 2 ‘ చిత్రానికి షిఫ్ట్ అవుతున్నాను. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాను. ఇవన్నీ పూర్తి అయ్యేందుకు ఆరేళ్ళ సమయం పడుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ వంగ.

ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో ఒక సినిమా చేసేందుకు సిద్దమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడు అనే దానిపై క్లారిటీ లేదు. అప్పటికీ ఏ టాప్ డైరెక్టర్ ఖాళీగా ఉంటే ఆ డైరెక్టర్ తో చెయ్యొచ్చు. కానీ మహేష్ రాజమౌళి సినిమా పూర్తి అయ్యేలోపు 10 ఏళ్ళ సమయమైనా పట్టొచ్చు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మూడు భాగాల్లో తెరకెక్కనుంది అనే టాక్ ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది మూవీ టీం. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.