BJP: పార్టీలకు విరాళాలు సేకరించడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే ఈ విరాళాలు అనేవి ఒకప్పుడు కేవలం డబ్బుల రూపంలోనే ఇచ్చేవారు. ఇంకొందరు అయితే భూములను కూడా విరాళంగా ఇచ్చేవారు. ఇలా విరాళాలు సేకరించే క్రమంలో.. మన దేశంలో అత్యంత ధనవంతమైన పార్టీగా అవతరించింది బీజేపీ. ఈ పార్టీకి ఉన్నన్ని ఆస్తులు మరే పార్టీకి లేవంటే ఏ స్థాయిలో విరాళాలు సేకరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
విరాళాలు సేకరించే విధానంలో ఇప్పుడు కొన్ని మార్పులు కూడా వచ్చాయి. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాండ్ల రూపంలో కూడా విరాళాలను సేకరిస్తోంది. ఇలా సేకరించిన వాటన్నింటినీ కలిపితే మొత్తం రూ.5వేల కోట్ల దాకా స్థిరాస్తులు ఉన్నాయంట బీజేపీకి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించింది. ఇంత ఆస్తి ఇండియాలో మరే పార్టీకి లేదని క్లారిటీ ఇచ్చేసింది ఈ సంస్థ.
అంతెందుకు కాళేశ్వరాన్ని కట్టిన మేఘా కంపెనీయే బీజేపీకి ఏకంగా రూ.20 కోట్లను విరాళంగా అందించింది. బాండ్ల రూపంలో ఇచ్చే కంపెనీల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. బీజేపీ దెబ్బకు మేఘా కంపెనీ మీద గత ఏడాది ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. అంటే పార్టీ చేతిలో పవర్ ఉంది కాబట్టి తలొగ్గి విరాళాన్ని ఇచ్చిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Also Read: TRS vs BJP: టీఆర్ఎస్ సంచలన నిర్ణయం..! ప్రధాని నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన?
అయితే బీజేపీ అధికారంలోకి వచ్చి కేవలం ఏడేండ్లు మాత్రమే అవుతోంది. ఈ గ్యాప్ లో ఈ స్థాయిలో విరాళాలు సేకరించడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇకపోతే యాభై ఏండ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు తిప్పి కొడితే రూ.5 వందల కోట్లు కూడా లేవు. ఇప్పుడు ఆ పార్టీకి విరాళం ఇచ్చే వారు కూడా కరువయ్యారు. కానీ బీజేపీకి మాత్రం ఓ రేంజ్లో విరాళాలు వస్తున్నాయి. బీజేపీకి ఇస్తే దేశం మరింత బలోపేతం అయినట్టే అనే సంకేతాలను ఇస్తున్నారు.
అయితే కేవలం కార్పొరేట్ కంపెనీల నుంచే కాకుండా కార్యకర్తల దగ్గరి నుంచి కూడా పెద్ద ఎత్తున విరాళాలను సేకరిస్తోంది బీజేపీ పార్టీ. మరి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు సేకరిస్తోంది అంటే.. రాబోయే కాలంలో తమకు తిరుగుండద్దని భావించడం కూడా ఒక ఎత్తు. ఇంకోటి ఏంటంటే.. ఎన్నికల్లో విచ్చల విడిగా ఖర్చు పెట్టాలన్నా తమ వద్ద డబ్బులు ఉండాలనేది బీజేపీ ఎత్తుగడ. అందుకే పార్టీ ఆర్థికంగా బలోపేతం అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా కార్యకర్తలు తమవెంటే ఉంటారనేది బీజేపీ నమ్మకం.
Also Read: BJP vs TRS: మోడీ రాజ్యాంగం.. టీఆర్ఎస్ కొత్త వ్యూహం