పైగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రమే హీరో హీరోయిన్ ఫోటోలను రివీల్ చేశారు మేకర్స్. అప్పట్లో ఈ సినిమా పోస్టర్స్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూశారు. నిజానికి ఇది సినిమాగా తీయాలని ప్లాన్ చేసి తీసిన సినిమా కాదు. బాలీవుడ్ లో ‘టి సీరిస్’ క్యాసెట్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది. సంగీత ప్రపంచంలో చాలా ప్రముఖమైన కంపెనీగా ‘టి సీరిస్’ ఎదుగుతున్న రోజులు అవి.
దాంతో ఆ కంపెనీ ఎక్కువమంది గాయకులకు జాబ్స్ ఇచ్చి ప్రైవేట్ సాంగ్స్ చేయించేది. అద్భుతమైన సాహిత్యం తో పాటు మంచి మంచి గాయకులూ కూడా ఆస్థాన గాయకులుగా ఉండటంతో అందరూ కలిసి ఎంతో ఇష్టంగా కొన్ని అద్భుతమైన సాంగ్స్ ను కంపోజ్ చేశారు. ‘టి సీరిస్’లోనే సంగీత దర్శకులు కూడా చాలా మంది ఉండేవారు. అందుకే సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి.
ఈ సాంగ్స్ అన్నిటినీ ఒక ఆల్బమ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన ఆడియో క్యాసెట్ ను కూడా రెడీ చేశారు. ఆ క్యాసెట్ కు పెట్టిన పేరు ‘చాహత్’. అయితే, ఈ క్యాసెట్ కోసం రికార్డింగ్స్ జరుగుతున్న సమయంలో దర్శక నిర్మాత మహేష్ భట్ అటు వైపు వెళ్ళారట. పాటలు విని ‘అరె.. పాటలు ఎంతో బాగున్నాయి. సాంగ్స్ ను క్యాసెట్ గా కాకుండా సినిమాగా ప్లాన్ చేయి’ అని టి సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ కి చెప్పారు మహేష్ భట్.
అలా జస్ట్ ఒక క్యాసెట్ గా రావాల్సిన ఈ క్లాసిక్ సాంగ్స్ ఏకంగా సినిమాగా మారి ఇప్పటికీ క్లాసిక్ మూవీగా మనల్ని అలరిస్తూనే ఉంది. అన్నట్టు ఈ సినిమాలో ఏకంగా 12 పాటలు ఉండటం, అన్నీ సూపర్ హిట్ అవ్వడం విశేషం.