https://oktelugu.com/

Aaradugula bullet trailer: ఆరడగుల బుల్లెట్ ట్రైలర్: దశాబ్ధం కిందటి కథ.. ఇప్పుడు ఎక్కుతుందా?

Aaradugula bullet trailer: దశాబ్ధం కిందట అప్పటి దిగ్గజ దర్శకుడు బీ.గోపాల్ రూపొందించిన మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’. ఆర్థిక సమస్యలతో ఆగిపోయి మూలన పడ్డ ఈ మూవీని ఈ కరోనా కల్లోలం ముగిశాక ధైర్యం చేసి బయటకు తీసి దుమ్ము దులిపి విడుదల రెడీ చేస్తున్నారు. అయితే ఆ పాత సీన్లు. పాత ఫ్లేవర్ మాత్రం సినిమాలో అలా ఉంది. నేటి అభిరుచి మారిన ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారో లేదో తెలియదు కానీ.. విడుదలకు అయితే సిద్ధం […]

Written By: NARESH, Updated On : October 4, 2021 2:08 pm
Follow us on

Aaradugula bullet trailer: దశాబ్ధం కిందట అప్పటి దిగ్గజ దర్శకుడు బీ.గోపాల్ రూపొందించిన మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’. ఆర్థిక సమస్యలతో ఆగిపోయి మూలన పడ్డ ఈ మూవీని ఈ కరోనా కల్లోలం ముగిశాక ధైర్యం చేసి బయటకు తీసి దుమ్ము దులిపి విడుదల రెడీ చేస్తున్నారు. అయితే ఆ పాత సీన్లు. పాత ఫ్లేవర్ మాత్రం సినిమాలో అలా ఉంది. నేటి అభిరుచి మారిన ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారో లేదో తెలియదు కానీ.. విడుదలకు అయితే సిద్ధం చేశారు.

గోపీచంద్ హీరోగా.. నయనతార హీరోయిన్ గా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్. ఎన్నో గొప్ప మాస్ చిత్రాల తీసిన నాటి దిగ్గజ దర్శకుడు బి.గోపాల్ దశాబ్ధం కిందట తీసిన సినిమా ఇదీ. ఆయన ఫుల్ ఫామ్ లో ఉండగా తీసిన ఈ మూవీ ఆర్థిక, నిర్మాణంలో అనేక చిక్కులతో నిర్మాత ఆ భారాన్ని మోయలేక ఆగిపోయింది. ఎట్టకేలకు ఈ సినిమాకు మోక్షం లభించింది.అన్నీ సమస్యలు దాటుకొని అక్టోబర్ 8న థియేటర్ లో రిలీజ్ చేయడానికి వస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

ట్రైలర్ లో కొన్ని మెరుపులు కనిపించాయి. పదేళ్ల క్రితం నాటి పాత మెరుపులు అనిచూస్తేనే తెలుస్తోంది. ట్రైలర్ చూస్తే.. చిల్లరగా తిరిగే ఓ కుర్రాడు ప్రేమలో పడడం.. విలన్ ఎంట్రీ.. విలన్ తో తన కుటుంబానికి ఆపద.. ఆ విలన్ ను హీరో ఇరగదీయడం ప్రధాన కథాంశంగా ‘ఆరడుగుల బుల్లెట్’ ట్రైలర్ ఉందని తెలుస్తోంది.

పదేళ్ల క్రితం నాటి సంఘటనల ఆధారంగా ఈ కథను రాసి తీశారని చూస్తేనే అర్థమవుతోంది. యాక్షన్ సీన్లను బి.గోపాల్ బాగానే దట్టించాడు. ఆయన మార్క్ ఫైట్ సీన్లు కనువిందు చేస్తున్నాయి. వక్కంతం వంశీ కథను అందించడం.. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు ఆకర్షణ.. పక్కా మాస్ మసాలా హంగులున్న ఈ చిత్రం మరి ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Aaradugula Bullet Movie Trailer | Gopichand | Nayanthara | Brahmanandam | Mani Sharma | B Gopal