Homeఎంటర్టైన్మెంట్Aamir Khan: ఒకే కారులో ఇద్దరు మాజీ భార్యలు.. కాబోయే భార్య తో కలిసి ట్రిప్...

Aamir Khan: ఒకే కారులో ఇద్దరు మాజీ భార్యలు.. కాబోయే భార్య తో కలిసి ట్రిప్ కి వెళ్తున్న అమీర్ ఖాన్.. వీడియో వైరల్..

Aamir Khan: బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో అమీర్ ఖాన్ పేరు కచ్చితంగా ఉంటుంది. కరోనా లాక్ డౌన్ కి ముందు బాలీవుడ్ ని రెండు దశాబ్దాల పాటు తిరుగులేని సూపర్ స్టార్ గా ఒక ఊపు ఊపాడు. ఆయన సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ రికార్డ్స్ ని కేవలం ఆయన మాత్రమే బద్దలు కొట్టేవాడు. మిగిలిన ఇద్దరు ఖాన్స్ పీక్ రేంజ్ ఫార్మ్ లో ఉన్నప్పటికీ కూడా, అమీర్ ఖాన్ కలెక్షన్స్ కి దరిదాపుల్లో ఉండేవారు కాదు. గజినీ నుండి అమీర్ ఖాన్ బాక్స్ ఆఫీస్ డామినేషన్ ‘దంగల్’ వరకు సాగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ , సినిమాలు చేసే సంఖ్య బాగా తగ్గించాడు అమీర్ ఖాన్. ఇకపోతే అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం పై విమర్శలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు.

ఎందుకంటే ఆయనకు రెండు సార్లు విడాకులు జరిగింది కాబట్టి. విడాకులు జరిగినప్పటికీ కూడా తన మాజీ భార్యలతో అమీర్ ఖాన్ చాలా గొప్ప ఫ్రెండ్ షిప్ రిలేషన్ ని మైంటైన్ చేస్తున్నాడు. అందుకు ఉదాహరణ గా నిల్చింది రీసెంట్ గా జరిగిన ‘లగాన్ ‘ సిల్వర్ జూబ్లీ వేడుకలు. ఈ చిత్రం విడుదలై 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబై లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి అమీర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలతో కలిసి హాజరయ్యాడు. అనంతరం ఈవెంట్ ముగిసిన తర్వాత , ఆయన ఇద్దరు భార్యలతో కలిసి ఒకే కారులో వెళ్ళాడు. గమ్మత్తు ఏమిటంటే అమీర్ ఖాన్ కాబోయే భార్య కూడా అదే కారులో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో షేక్ చేస్తోంది. అమీర్ ఖాన్ మొదటి భార్య పేరు రీనా దత్త. ఈమెతో కొన్నాళ్ళకు విడాకులు జరిగిన తర్వాత , లగాన్ మూవీ షూటింగ్ సమయం లో కిరణ్ రావు తో ప్రేమలో పడ్డాడు అమీర్ ఖాన్.

రెండు దశాబ్దాల పాటు ఆమెతో కలిసి మంచి దాంపత్య జీవితాన్ని గడిపాడు. కానీ కొన్ని విబేధాల కారణంగా విడిపోయారు కానీ , వీళ్లిద్దరు ఇప్పటికీ స్నేహం గానే ఉన్నారు , ఇద్దరు కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు కూడా. ఇకపోతే అమీర్ ఖాన్ ప్రస్తుతం గౌరీ అనే అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడు. త్వరలోనే ఈమెని పెళ్లాడబోతున్నాడని టాక్. ఇవన్నీ పక్కన పెడితే ఇదే కారులో అమీర్ ఖాన్ చిన్న కుమారుడు ఆజాద్ కూడా ఉండడం విశేషం. సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular