https://oktelugu.com/

Kgf 2: కేజీఎఫ్ 2 చిత్రానికి పోటీగా వస్తున్న ఆమీర్ ఖాన్ ” లాల్ సింగ్ చద్దా “…

Kgf 2: బాహుబలి చిత్రం తర్వాత దక్షిణాది సినిమాలకు పాన్ ఇండియా లెవెల్ లో బిజినెస్ బాగా పెరిగింది. ఆ క్రమంలోనే వచ్చిన కేజీయఫ్ చిత్రం దక్షిణాది చిత్రాల క్రేజ్ మరింత పెంచింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వస్తున్న కేజీయఫ్ 2 చిత్రం ఫై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 20, 2021 / 08:03 PM IST
    Follow us on

    Kgf 2: బాహుబలి చిత్రం తర్వాత దక్షిణాది సినిమాలకు పాన్ ఇండియా లెవెల్ లో బిజినెస్ బాగా పెరిగింది. ఆ క్రమంలోనే వచ్చిన కేజీయఫ్ చిత్రం దక్షిణాది చిత్రాల క్రేజ్ మరింత పెంచింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వస్తున్న కేజీయఫ్ 2 చిత్రం ఫై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో “ కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి.

    ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ లెవెల్లో ఈ సినిమా  రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి బాలీవుడ్ మార్కెట్ లో పెద్ద పోటీ ఎదురయ్యింది. బాలీవుడ్  స్టార్ హీరో  ఆమీర్ ఖాన్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “లాల్ సింగ్ చద్దా”.  కూడా ఇదే కేజీయఫ్ 2 డేట్ ఏప్రిల్ 14 కి ఫిక్స్ అయ్యింది. హిందీ మార్కెట్ లో ఆమీర్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినా కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో కేజీయఫ్ కి ఇది గట్టి పోటీనే అని చెప్పాలి. మరి అప్పటికి బాక్సాఫీస్ పోటీ ఉంటుందో చూడాలి. ఆమిర్ మాజీ మేనేజర్ అద్వైత్ చందన్ రూపొందించిన ఈ చిత్రంలో కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.