Homeఎంటర్టైన్మెంట్Rakul Preeth Singh: నటి రకుల్ నివసిస్తున్న బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం...

Rakul Preeth Singh: నటి రకుల్ నివసిస్తున్న బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం…

Rakul Preeth Singh: వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​లో హీరోయిన్​గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తన అందం, అభినయంతో అభిమానులను సొంతం చేసుకుంది రకుల్​. ఇటీవలే జాకీ భగ్నానితో రిలేషన్​లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరోవైపు, వీరిద్దరు పెళ్లికి సంబంధించి సన్నాహాలు  కూడా మొదలు పెట్టినట్లు సమాాచారం. అయితే తాజాగా  రకుల్ ప్రీత్ సింగ్ నివాసం ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. ముంబై లోని ఈ బిల్డింగ్‌లో 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు.

fire accident in rakul preeth singh living building at mumbai

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో రకుల్‌ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది. కాగా మంటలు రాజుకోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియలేదు.

రకుల్ తెలుగులో చివరగా కొండపొలం అనే సినిమాలో నటించింది. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన ‘కొండ‌పొలం’ న‌వ‌ల‌ను ఆధారంగా చేసుకుని జాగ‌ర్ల‌మూడి క్రిష్  ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో వైష్ణ‌వ్‌ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాకు  ప్రేక్షకుల నుంచి మంకీ స్పందన లభించిన కలెక్షన్లు సాధించడంలో మాత్రం మూవీ విఫలమైందని చెప్పాలి. అలానే రకుల్ ఈ మధ్య కాలంలో బాగా సన్నబడడం కూడా ఆమెకు ఆఫర్లు తగ్గడానికి కారణం అని అంటున్నారు. మొత్తానికి అనుకోని రీతిలో జరిగిన ప్రమాదంలో రకుల్ కు ఏం జరగకపోవడం పట్ల ఆమె అభిమానులంతా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version