https://oktelugu.com/

Tollywood: టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన తమిళ హీరోలు సర్వం సిద్ధం…

Tollywood: తమిళనాట స్టార్ హీరోలైన విజయ్, అజిత్, విక్రమ్, సూర్య, కార్తి, విశాల్, ధనుశ్ వీరికి తెలుగు అభిమానులు కూడా ఉన్నారు ఇప్పటికే వీరికి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన చిత్రాలు డబ్బింగ్ వెర్షన్ లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇప్పటి వరకు డబ్బింగ్ వెర్షన్ లో చిత్రాన్ని విడుదల చేసిన ఈ హీరోలు నేరుగా తమ సినిమాని తెలుగు డైరెక్టర్ తో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. వైవిధ్యమైన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 20, 2021 / 08:12 PM IST
    Follow us on

    Tollywood: తమిళనాట స్టార్ హీరోలైన విజయ్, అజిత్, విక్రమ్, సూర్య, కార్తి, విశాల్, ధనుశ్ వీరికి తెలుగు అభిమానులు కూడా ఉన్నారు ఇప్పటికే వీరికి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన చిత్రాలు డబ్బింగ్ వెర్షన్ లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇప్పటి వరకు డబ్బింగ్ వెర్షన్ లో చిత్రాన్ని విడుదల చేసిన ఈ హీరోలు నేరుగా తమ సినిమాని తెలుగు డైరెక్టర్ తో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. వైవిధ్యమైన కథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల రూటే వేరు అని చెప్పాల్సింది. చిన్న వయసు లోనే విభిన్నమైన కథను ఎంచుకొని తన నటనకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందిన హీరో ధనుష్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుశ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది.

    తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అలానే వంశీ పైడిపల్లి విజయ్ కాంబినేషన్ లో కూడా ఒక చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని మార్పులు చేయమని వంశీ పైడిపల్లికి  చెప్పారట విజయ్. ఈ మూవీ కూడా వచ్చే ఏడాది నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలానే  జాతిరత్నాలు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ ఓ సినిమా చేయబోతునట్టు తెలుస్తోంది. సూర్య, కార్తీక్ కూడా ఇదే రేసులో ఉన్నారు. దీంతో తమిళ హీరోలు అందరి ఫోకస్ ప్రస్తుతం టాలీవుడ్ వైపే ఉందని తెలుస్తుంది.