Aamir Khan: చేసే ప్రతీ పాత్రలోనూ పర్ఫెక్షన్ కోరుకునే హీరోలలో ఒకరు అమీర్ ఖాన్(Amir Khan). ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ హీరో. మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ సినిమాని అందించినది ఈ హీరోనే. అదే విధంగా ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్ కూడా ఈయన నటించిన ‘దంగల్’ చిత్రం పేరు మీదనే ఉంది. 2017 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ రికార్డు ని రీసెంట్ సెన్సేషన్ ‘పుష్ప 2’ కూడా అందుకోలేకపోయింది. అయితే ఈమధ్య కాలంలో ఈ హీరోకు ఏది కలిసి రావడం లేదు. ‘దంగల్’ తర్వాత చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అంతే కాకుండా తన డ్రీం ప్రాజెక్ట్స్ కి అడ్డు తగులుతున్నారు.
Also Read: బెల్లంకొండ శ్రీనివాస్ పై పోలీస్ కేసు నమోదు..అరెస్ట్ తప్పదా?
ఇప్పటికే ఆయన మహాభారతాన్ని తెరకెక్కించడం తన డ్రీం ప్రాజెక్ట్ అని అనేక సందర్భాల్లో చెప్పడం మనమంతా చూసాము. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ఇప్పటికే మొదలు పెట్టేసాడు. అయితే ఇదే మహాభారతాన్ని రాజమౌళి(SS Rajamouli) కూడా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ తో చేస్తున్న సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే ప్రాజెక్ట్ బహుశా ఇదే అయ్యుండొచ్చు. ఇది కాసేపు పక్కన పడితే అమీర్ ఖాన్ మరో డ్రీం ప్రాజెక్ట్, ఇండియన్ సినిమాకి తండ్రిగా పిలవబడే బాబా సాహెబ్ పాల్కే(Dadasaheb Phalke) బయోపిక్ లో నటించడం. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ(Raj Kumar Hirani) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఆయన తదుపరి చిత్రం ఇదే అవ్వొచ్చు. కానీ ఇప్పుడు అదే బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) నటించబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియా లో బాగా ప్రచారం అవుతుంది.
గతం లోనే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు ఆయన దర్శకత్వం మాత్రం వహించడం లేదు, కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే టైటిల్ ని కూడా పెట్టారు. ఇందులో ఎన్టీఆర్ హీరో గా నటించబోతున్నాడు అనేది దాదాపుగా ఖరారు అయ్యినట్టే. ఇలా అమీర్ ఖాన్ డ్రీం ప్రాజెక్ట్స్ గా పిలవబడే ఈ రెండు ప్రాజెక్ట్స్ కి రాజమౌళి అడ్డుగా నిలిచాడు. ఇద్దరూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దాదా సాహెబ్ బయోపిక్ ముందుగా అమీర్ ఖాన్ మొదలు పెట్టె అవకాశం ఉంది. ఒకవేళ ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఎన్టీఆర్ ‘మేడ్ ఇన్ ఇండియా’ తెరకెక్కే అవకాశం లేకపోవచ్చు. ఒకవేళ ఫ్లాప్ అయితే కచ్చితంగా తెరకెక్కే అవకాశం ఉంటుంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నాడు కాబట్టి, కచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువ.