అమీర్ ఖాన్ పక్కా ప్లాన్ తోనే చేశాడు !

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుకి విడాకులు ఇస్తున్నా అని ప్రకటించగానే అమీర్ ఫ్యాన్సే అతని పై విరుచుకు పడ్డారు. మరోపక్క సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోలింగ్ తో హోరెత్తింది. ఇప్పటికీ మూడు రోజులైనా అమీర్ ఖాన్ కి వ్యతిరేకంగా ట్రెండింగ్ ఆగడం లేదు అంటేనే.. అమీర్ పై ఎంతగా వ్యతిరేఖత ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు సార్లు విడాకులు ఇచ్చాడు అనే […]

Written By: admin, Updated On : July 6, 2021 5:26 pm
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుకి విడాకులు ఇస్తున్నా అని ప్రకటించగానే అమీర్ ఫ్యాన్సే అతని పై విరుచుకు పడ్డారు. మరోపక్క సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోలింగ్ తో హోరెత్తింది. ఇప్పటికీ మూడు రోజులైనా అమీర్ ఖాన్ కి వ్యతిరేకంగా ట్రెండింగ్ ఆగడం లేదు అంటేనే.. అమీర్ పై ఎంతగా వ్యతిరేఖత ఉందో అర్ధం చేసుకోవచ్చు.

నిజానికి అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు సార్లు విడాకులు ఇచ్చాడు అనే వార్త కన్నా.. 29 ఏళ్ల యంగ్ హీరోయిన్ తో అలవాటు పడిన రొమాన్స్ కోసమని 56 ఏళ్ల వయసులో కూడా అమీర్ ఖాన్ భార్యను వదిలించుకోవడం జనానికి అసలు నచ్చలేదు. గత ఏడాది నుండే అమీర్ ప్రేమలో పడ్డాడని పుకారు బాగా ప్రచారం జరిగినా ఎప్పుడు ఇంతగా ఈ వార్త వైరల్ కాలేదు.

ఆమీర్ ఖాన్ కున్న పాపులారిటీ మొత్తం ఆయన మిస్టర్ పర్ ఫెక్ట్ అనే ఇమేజ్ మీదే ఆధార పడి ఉంది. అలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ కాస్త ఇలా అమ్మాయిల వ్యసనపరుడిగా మారిపోవడం బాలీవుడ్ ప్రేక్షకులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ కూడా అమీర్ పై షికార్లు చేస్తున్నాయి. వాటిలో ఒకటి ‘బడి మా, చోటీ మా.. ఫాతిమా!’ అంటూ నెటిజన్లు తెగ హడావిడి చేస్తున్నారు.

మొత్తానికి అమీర్ ఖాన్ ఈ ట్రోలింగ్ ను ముందే ఊహించినట్లు ఉన్నాడు. తెలివిగా ఈ ఏడాది మార్చిలోనే అమీర్ ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అలాగే తన పై విమర్శలు వస్తాయని తెలిసే.. పక్కన కిరణ్ రావును కూడా కూర్చోపెట్టుకుని ఆమె చేత విడాకుల గురించి పాజిటివ్ గా చెప్పించాడు. కానీ ఆ వీడియోలో కిరణ్ రావు పైకి నవ్వుతున్నా లోలోపల కుమిలిపోతునట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అమీర్ ఖాన్ ఇదంతా పక్కా ప్లాన్ తోనే చేశాడు.