https://oktelugu.com/

కేంద్ర కేబినెట్ లో అర్వింద్ కు స్థానం? రాత్రి కల్ల లిస్ట్ రెడీ

కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. దీనికి సంబంధించిన జాబితా సిద్ధమైంది. దీనికి కేంద్రమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ రాత్రికే మంత్రివర్గ జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈసారి విస్తరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు సైతం ప్రాధాన్యం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ కు అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. సీఎం రమేశ్ […]

Written By: , Updated On : July 6, 2021 / 05:24 PM IST
Follow us on

dharmapuri arvindకేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. దీనికి సంబంధించిన జాబితా సిద్ధమైంది. దీనికి కేంద్రమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ రాత్రికే మంత్రివర్గ జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈసారి విస్తరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు సైతం ప్రాధాన్యం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ కు అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. సీఎం రమేశ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కుంభంపాటి హరిబాబును గవర్నర్ గా నియమించింది. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణకు సముచిత స్థానం కల్పిస్తారని చెబుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ధర్మపురి అర్వింద్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.2019 సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను ఓడించి అప్పట్లో సంచలనం సృష్టించారు.

ధర్మపురి అర్వింద్ కు మంత్రి పదవి అప్పగించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ బెర్త్ ఖాయమైన అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీకి బయలుదేరారు. దీంతో మంత్రివర్గ కూర్పుపై సమాలోచనలుచేసి పలువురిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.

మంత్రివర్గ విస్తరణపై సీనియర్ నేతలు చర్చించి అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యూపీ నుంచి తమిళనాడు వరకు ఏరికోరి నాయకులను సెలెక్ట్ చేశారు. మంత్రివర్గ విస్తరణలో యూపీకి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై అప్పుడే ఆశావహుల్లో అంచనాలు పెరిగిపోయాయి.