ఎంటర్టైన్మెంట్Actress Aamani: సినిమాలు వద్దు అన్నాడని భర్తకు విడాకులు ఇచ్చిన హీరోయిన్.. ఆమె ఎవరో చూస్తే...

Actress Aamani: సినిమాలు వద్దు అన్నాడని భర్తకు విడాకులు ఇచ్చిన హీరోయిన్.. ఆమె ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు..

Actress Aamani: సీనియర్ హీరోయిన్స్ లో అందంతో పాటు , అద్భుతమైన అభినయం కనబర్చగల వారిలో ఒకరు ఆమని. ఆరోజుల్లో సంసారపక్షమైన పాత్రలకు ఈమె చిరునామా లాగా నిలిచేవారు. వరుసగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకొని , అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ఒక ప్రముఖ తమిళ నిర్మాతని పెళ్లి చేసుకొని , 5 ఏళ్ళ వరకు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఒకప్పటి రేంజ్ సక్సెస్ లు రాలేదు. అయినప్పటికీ హీరోయిన్ గా కొనసాగింది. ఇక ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయ్యింది. మరోపక్క టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ఇల్లు ఇల్లాలు ప్రియురాలు’ సీరియల్ ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతోంది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో , ఆమె తన జీవితం లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి మాట్లాడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘ నా భర్త కి మంచి డబ్బు ఉంది. ఆయన పెళ్లయ్యాక సినిమాలు చేయొద్దు అన్నారు. మా అమ్మ అప్పట్లో ఒక్కటే అనింది. నీ పెళ్లి చేసుకో , పిల్లల్ని కను , నేనేమి అడ్డుపడను , కానీ సినిమాలు మాత్రం వదలకు. నువ్వు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డావు, దేవుడు ఇచ్చిన ఈ వృత్తిని వదలకు అని మా అన్న నాకు చిలక్కి చెప్పినట్టు చెప్పింది. కానీ నేను వినలేదు. మరో 5 ఏళ్ళు ఇండస్ట్రీ లో కొనసాగి ఉండుంటే , చాలా మంచి క్యారెక్టర్స్ చేసేదాన్ని ఏమో’.

‘కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను. ఎన్నో అద్భుతమైన సినిమాలను వదులుకున్నాను. అదొక్కటే నేను చేసిన మిస్టేక్’ అంటూ చెప్పుకొచ్చారు ఆమని. మీది లవ్ మ్యారేజా ? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమని సమాధానం చెప్తూ ‘లవ్ మ్యారేజ్ అని కాదు కానీ , ఒక ఏకాభిప్రాయంతో జరిగిన వివాహం. మా ఆయన తమిళం లో పెద్ద నిర్మాత. నా రెండవ సినిమాని నిర్మించింది ఆయనే. ఆరోజుల్లో మా కుటుంబానికి చాలా అండగా ఉండేవారు. ఏ కష్టం రానివ్వకుండా చూసుకునేవారు, అలా నాకు బాగా దగ్గరవ్వడం తో పెళ్లి చేసుకున్నాను. ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి ఆయన. కాకపోతే నాకు సినిమా పిచ్చి ఎక్కువ , రీ ఎంట్రీ ఇస్తానని అన్నప్పుడు ఆయన వద్దు అన్నారు, అందుకే విడాకులు ఇచ్చాను’ అంటూ చెప్పుకొచ్చారు ఆమని. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియోలో చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Aamani: భర్తతో విడాకులు అసలు విషయం చెప్పిన ఆమని.. వైరల్ కామెంట్స్

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమని చెప్పిన పలు ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమని తన పెళ్లి, విడాకుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Aamani: ఆమని చిరంజీవి తో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటంటే..?

సినిమా ప్రొడ్యూసర్ చిరంజీవి పక్కన ఈమె హీరోయిన్ గా సెట్ అవ్వదు అని తనని రిజెక్ట్ చేసి వేరే హీరోయిన్ ను ఆ సినిమాలో తీసుకున్నారట. ఇక దాంతో తన ఫేవరెట్ హీరో అయిన చిరంజీవి పక్కన నటించే అవకాశం వచ్చిందని సంబరపడిన ఆమని అవకాశం చేజారి పోవడంతో చాలా బాధపడిందట.

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version