Aamani: ఒకప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జంబలకడిపంబ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమని తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకొని వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది. ఆ తర్వాత ఆమని తెలుగులో శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, శ్రీవారి ప్రియురాలు, మావిచిగురు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు తో పాటు ఆమని తమిళ్ లో కూడా చాలా హిట్ సినిమాలలో నటించి మెప్పించింది. అక్కడి ప్రొడ్యూసర్ ఖాజా మొయినుద్దీన్ ను ప్రేమించి ఆమెని 1999లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలం క్రితం ఆమని తన భర్తతో విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమెని పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలాగే బుల్లితెర మీద సీరియల్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమని చెప్పిన పలు ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమని తన పెళ్లి, విడాకుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో ఆమని మేము అనుకోకుండా కనెక్ట్ అయ్యామని.. మాది లవ్ మ్యారేజ్ అని, పెద్దలు కుదిర్చిన పెళ్లి అని రెండు విధాలుగాను చెప్పలేను అంటూ వివరించింది. అనుకోకుండా కనెక్ట్ అయిన మేము, మంచితనం చూసి పెళ్లి చేసుకున్నాము. ఒక ప్రొడ్యూసర్ గా ఉన్న నా భర్త ఒక సినిమా తీసి కోట్లు నష్టపోయారు.
ఈ క్రమంలోనే అప్పులు ఎక్కువ అవడంతో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆయనే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఆ అప్పును తీర్చేశారు. అయితే ఆ సమయంలో నేను అప్పులు తీర్చడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాను అంటూ కొన్ని వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదంటూ ఆమని తెలిపింది. కేవలం సినిమా మీద ఉన్న ఆసక్తితో మాత్రమే నేను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను. అప్పట్లో నా భర్త కొన్ని రోజులు సినిమాలు మానేయమని చెప్పారు. సరే అని కొన్ని రోజులు దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చాను. మా ఇద్దరి మధ్య అంత పెద్ద సమస్యలు ఏవి లేవు అంటూ ఆమని చెప్పుకొచ్చింది.
మేము సరదాగా ఉంటూనే విడిపోయామని.. ఇక నేను సినిమాల్లోకి వచ్చేసా తను తన బిజినెస్ లో బిజీగా ఉన్నారంటూ తెలిపింది. అయితే ఇప్పటి వరకు మేము ఇద్దరం విడాకులు తీసుకోలేదని కానీ వేరువేరుగా ఉంటున్నాము. పిల్లలు నాతోనే ఉంటున్నారు అంటూ ఆమని వివరించింది. ప్రస్తుతం ఆమెని చెప్పిన ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో వీరిద్దరికి విడాకులు కాలేదా.. అయితే ఏ కారణాలతో వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు అంటూ నేటిజెన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.