Aamani: క్యాస్టింగ్ కౌచ్ ఉంది నన్ను కూడా డ్రెస్ తీసి చూపించమన్నారు… ఆమని సంచలన కామెంట్స్

అప్పట్లో మొబైల్స్ ఉండేవి కావు. కథ చర్చల కోసం నేరుగా కలవాలని అనేవారు. ఒకరోజు ఫైనాన్షియర్ నిన్ను చూడాలంటున్నాడని కబురు పంపారు. అసలు ఒక పాత్రకు నన్ను దర్శకుడు చూడాలి లేదంటే హీరో, నిర్మాత చూడాలి.

Written By: Shiva, Updated On : August 10, 2023 3:12 pm

Aamani

Follow us on

Aamani: సీనియర్ నటి ఆమని క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నారు. ఆమెకు కూడా అలాంటి అనుభవాలు అయ్యాయని చెప్పడం సంచలనంగా మారింది. ఆమని మాట్లాడుతూ… ఓ దర్శకుడు నీకు స్విమ్మింగ్ ఫూల్ సన్నివేశం ఉందన్నారు. అందుకు బికినీ వేయాల్సి ఉంటుంది. నీ శరీరం మీద స్క్రాచ్లు పరిశీలించాలి బట్టలు తీసేయ్ అన్నారు. అందుకు నేను ఒప్పుకోలేదు. నాకు సందేహం కలిగింది. ఇలాంటి పాత్ర చేయనని చెప్పేశానని అన్నారు.

అప్పట్లో మొబైల్స్ ఉండేవి కావు. కథ చర్చల కోసం నేరుగా కలవాలని అనేవారు. ఒకరోజు ఫైనాన్షియర్ నిన్ను చూడాలంటున్నాడని కబురు పంపారు. అసలు ఒక పాత్రకు నన్ను దర్శకుడు చూడాలి లేదంటే హీరో, నిర్మాత చూడాలి. ఫైనాన్షియర్ చూడటమేంది అన్నాను. నాకు సందేహం కలిగి రానని చెప్పాను, అని ఆమని అన్నారు. చిన్న ప్రొడక్షన్ హౌసెస్ విషయంలో ఇలాంటి సంఘటనలు జరిగేవని ఆమని అన్నారు.

కొందరు మీ అమ్మతో రావద్దు. ఒంటరిగా రావాలని చెప్పేవారు. నాకు సందేహం కలిగి రానని చెప్పేదాన్ని అని ఆమని చెప్పుకొచ్చారు. పరిశ్రమలో ఎప్పటి నుండో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న ఆమని… మనం జాగ్రత్తగా ఉండాలన్నారు. మనకు కొన్ని విషయాలు అర్థం అవుతాయి. అప్పుడు అది మన ఛాయిస్ అన్నారు. అమ్మాయిలు తెలివిగా ఉండాలి. మనకు ఇష్టం లేని విషయాలు నేరుగా చెప్పాలి. ఒకరిని తప్పుబట్టడం సరికాదని ఆమని అన్నారు.

ఆమని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె అమ్మ పాత్రలు చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె కెరీర్ బాగుంది. వరుస చిత్రాలు చేస్తుంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది. ఆమని జంబలకడిపంబ, మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం వంటి చిత్రాలతో ఫేమ్ తెచ్చుకుంది. చిరంజీవి, కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ పక్కన నటించింది.