https://oktelugu.com/

Agent Movie Collections: మమ్మూటీ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ ని కూడా రికవర్ చేయలేకపోయిన ‘ఏజెంట్’ చిత్రం

ఇది కేవలం అఖిల్ కెరీర్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చెప్పుకోవచ్చు. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాకి శనివారం, ఆదివారం రోజు కూడా కోటి రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయిందంటే ఇది ఏ రేంజ్ డిజాస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అక్కినేని ఫ్యాన్స్ బాధ అయితే వర్ణనాతీతం.

Written By:
  • Vicky
  • , Updated On : May 1, 2023 5:29 pm
    Follow us on

    Agent Movie Collections: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ ఇటీవలే విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. సుమారు 80 కోట్ల రూపాయిల బడ్జెట్ తో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అనిల్ సుంకర మరో నిర్మాత. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కనీసం ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది.

    ఇది కేవలం అఖిల్ కెరీర్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చెప్పుకోవచ్చు. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాకి శనివారం, ఆదివారం రోజు కూడా కోటి రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయిందంటే ఇది ఏ రేంజ్ డిజాస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అక్కినేని ఫ్యాన్స్ బాధ అయితే వర్ణనాతీతం.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్మూటీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆ పాత్ర చెయ్యడానికి ఆయన దాదాపుగా 6 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఉంటాడు కాబట్టి, ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అయితే ‘ఏజెంట్’ చిత్రం మొదటి మూడు రోజులకు కలిపి కేవలం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

    నాల్గవ రోజు నుండి ఈ సినిమాకి వసూళ్లు వచ్చే అవకాశమే లేదు, కనుక క్లోసింగ్ కలెక్షన్స్ 5 కోట్ల రూపాయలకే ఖాయం చేసేసుకోవచ్చు.అంటే మమ్మూటీ రెమ్యూనరేషన్ కంటే తక్కువ వసూళ్లను రాబట్టింది అన్నమాట. ఇది అక్కినేని కుటుంబానికే మాయని మచ్చ లాంటిది అని చెప్పొచ్చు. కెరీర్ లో ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగలేకపోగా, పైగా ఈ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ తగలడం అఖిల్ కి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి, ఆయన దీని నుండి ఎలా కోలుకుంటాడో చూడాలి.