Aadipurush collections : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకొని, కలెక్షన్స్ పరంగా కూడా డిజాస్టర్ గా మిగిలిన సంగతి అందరికీ తెలిసిందే. ముందు నుండి ఈ చిత్రానికి భారీ హైప్ ఉండడం వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరిగాయి. అందువల్ల ఓపెనింగ్ వసూళ్లు కళ్ళు చెదిరే రేంజ్ లో వచ్చాయి కానీ, ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం దారుణంగా పడిపోయాయి.
తెలుగు తో పాటుగా హిందీ వర్షన్ లో కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అలా మూడు రోజులకు కలిపి 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా 13 రోజులకు కలిపి 387 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. 13 వ రోజు చాలా ప్రాంతాలలో థియేటర్స్ రెంట్ ని కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం.
అందువల్ల కొంతమండ్రి డిస్ట్రిబ్యూటర్స్ రెంటల్ బేసిస్ మీద సినిమాని ఆపివేసి, కమిషన్ బేసిస్ మీద రన్ చెయ్యబోతున్నారు రేపటి నుండి. ఒకవేళ కమిషన్ బేసిస్ కి ఒప్పుకోకపోతే సినిమాని థియేటర్స్ నుండి తీసి వేస్తున్నారు. ఇక తమిళం మరియు మలయాళం వెర్షన్ వసూళ్లు చాలా దారుణంగా ఉన్నాయి.
మొదటి రోజు నుండే ఈ రెండు భాషలలో కనీస స్థాయి గ్రాస్ వసూళ్లు కూడా రావడం లేడు, ఇక షేర్ వసూళ్ల గురించి మాట్లాడుకోవడం కూడా వ్యర్థం అని అని అంటున్నారు ట్రేడ్ పండితులు.మరో వారం రోజులు ఈ భాషల్లో ఈ చిత్రాన్ని రన్ చేస్తే, వచ్చిన ఆ కాస్త షేర్ కూడా రెంట్స్ రూపం లో మాయమై జీరో షేర్ గా మిగిలిపోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఈ సినిమా క్లోసింగ్ వసూళ్లు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది.