Bigg Boss 6 Telugu- Adi Reddy: బిగ్ బాస్ షో లో ప్రతి వారం ప్రేక్షకులు ఎదురు చూసే కెప్టెన్సీ టాస్కు వచ్చేసింది..ఈ వారం కెప్టెన్సీ పోటీదారులాగా శ్రీహాన్, రేవంత్ , ఆది రెడ్డి , ఇనాయ , రోహిత్ పాల్గొన్నారు..వీరిలో కోసం బిగ్ బాస్ ‘కెప్టెన్సీ ఈజ్ యువర్ గోల్’ అనే ఆతని నిర్వహించాడు..ఈ ఆటని ఇంటి సభ్యులందరు చెలరేగిపోయి ఆడారు..బిగ్ బాస్ ప్రైజ్ మనీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉండడం తో అది కాపాడుకునే క్రమం లో కంటెస్టెంట్స్ మరింత కసితో ఆడుతున్నారు..50 లక్షల ప్రైజ్ మనీ కాస్త బిగ్ బాస్ చీప్ ట్రిక్కులు వాడి 41 లక్షల రూపాయిలు చేసాడు.

రాబొయ్యే రోజుల్లో ఇంకా ఎన్ని సవాళ్లు పెట్టి ఎంత కాష్ ప్రైజ్ ని తగ్గిస్తారో అని హౌస్ లోపల ఉన్న ఇంటిసభ్యులు భయపడిపోతున్నారు..అయితే ఊహించని మలుపులతో కంటెస్టెంట్స్ కి షాక్ మీద షాక్ ఇస్తున్న బిగ్ బాస్ కాష్ ప్రైజ్ తిరిగి వచ్చేలాగా రాబొయ్యే రోజుల్లో టాస్కులు నిర్వహిస్తాడో లేదో చూడాలి.
అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్కులో ఇంటి సబ్యుయిలకు గాయాలు బలంగానే తగిలాయి..ముఖ్యంగా ప్రత్యర్థుల గోల్స్ ని తన కోర్టులో పడేముందు ఆ బాల్ ని ఆపే ప్రయత్నం లో ఆదిరెడ్డి కి చెయ్యి బాగా దెబ్బతింటుంది..దెబ్బ తిన్న చెయ్యితోనే ఆయన టాస్క్ ఆడాడు..ఇక ఫైమా మరియు రేవంత్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది..’గేమ్ ఆడుతున్నప్పుడు కొట్టుకోవడం కాదు..కాస్త వినాలి’ అంటూ ఫైమా రేవంత్ ని వెక్కిరించడం తో ‘ఈ వెటకారమే కాస్త తగ్గిస్తే బాగుంటాది..నేను వెటకారం చెయ్యడం మొదలు పెడితే తట్టుకోలేవు’ అని ఫైమా ని బెదిరిస్తాడు.

అప్పుడు ఫైమా ‘నీ వెటకారం చూసి ఇక్కడ అందరూ భయపడిపోతున్నారు మరి’ కౌంటర్ ఇస్తుంది..అలా వీళ్లిద్దరి మధ్య గొడవ జరుగుతుంది..అయితే ఎవరికీ వారు గ్రూప్ తో ఆడుతుండగా ఇనాయ మాత్రం సింగల్ వారియర్ గా ఈ గేమ్ ఆడుతుంది..రోజు రోజుకి ఇనాయ తన గ్రాఫ్ ని పెంచుకుంటూ పోతుంది..బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే అవకాశాలు కూడా ఆమెకే ఎక్కువ ఉన్నాయి.
