https://oktelugu.com/

మూవీ రివ్యూః ‘ఏ1 ఎక్స్ ప్రెస్’

న‌టీన‌టులుః సందీప్ కిష‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి, ముర‌ళీ శ‌ర్మ‌, ర‌ఘుబాబు, రావు ర‌మేష్‌, సుద‌ర్వ‌న్‌, స‌త్య అక్కాల‌, క‌య్యుం అలీ, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు.. ద‌ర్శ‌క‌త్వంః డెన్నిస్ జీవ‌న్ క‌నుకోల‌ నిర్మాతః సందీప్ కిష‌న్‌, విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం మ్యూజిక్ః హిప్హాప్ త‌మీజా రిలీజ్ డేట్ః మార్చి 5 దాదాపు అన్ని దేశాల్లోనూ జాతీయ క్రీడ‌లు ఉచ్ఛ స్థితిలో ఉంటాయి. కానీ.. మ‌న‌దేశంలో మాత్రం జాతీయ క్రీడ.. ఓ అనామ‌క ఆట‌గా మిగిలిపోయింది. […]

Written By:
  • Rocky
  • , Updated On : March 5, 2021 / 11:06 AM IST
    Follow us on


    న‌టీన‌టులుః
    సందీప్ కిష‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి, ముర‌ళీ శ‌ర్మ‌, ర‌ఘుబాబు, రావు ర‌మేష్‌, సుద‌ర్వ‌న్‌, స‌త్య అక్కాల‌, క‌య్యుం అలీ, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు..
    ద‌ర్శ‌క‌త్వంః డెన్నిస్ జీవ‌న్ క‌నుకోల‌
    నిర్మాతః సందీప్ కిష‌న్‌, విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం
    మ్యూజిక్ః హిప్హాప్ త‌మీజా
    రిలీజ్ డేట్ః మార్చి 5

    దాదాపు అన్ని దేశాల్లోనూ జాతీయ క్రీడ‌లు ఉచ్ఛ స్థితిలో ఉంటాయి. కానీ.. మ‌న‌దేశంలో మాత్రం జాతీయ క్రీడ.. ఓ అనామ‌క ఆట‌గా మిగిలిపోయింది. గ‌త‌మెంతో ఘ‌నం అన్న‌ట్టుగా.. ఒక‌ప్పుడు విశ్వ వినువీధుల్లో ఎగిరిన భారత హాకీ పతాక.. ఇప్పుడు అవ‌సాన ద‌శ‌లో ఉంది. ఇలాంటి క్రీడా నేప‌థ్యాన్ని ఎంచుకున్నాడు ద‌ర్శ‌కుడు డెన్నిస్ జీవ‌న్ క‌నుకోల‌. అయితే.. హాకీ నేప‌థ్యంలో ‘చ‌క్ దే ఇండియా’ వంటి సినిమాలు వచ్చినప్పటికీ.. తెలుగులో మాత్రం ఇదే మొద‌టి చిత్రం. ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా స‌క్సెస్ గోల్ కొట్టిందా? లేదా? అన్న‌ది చూద్దాం.

    Also Read: బ్ర‌హ్మానందంపై సుడిగాలి కామెంట్స్‌..

    కథః సందీప్ కు హాకీ క్రీడ అంటే చాలా ఇష్టం. ఈ ఆట‌నే కెరీర్ గా మ‌లుచుకోవాల‌ను‌కుంటాడు. జాతీయ స్థాయి వ‌ర‌కు చేరుకుంటాడు. కానీ.. ఈ క్ర‌మంలో ఎదురైన ప‌రిస్థితుల‌తో నిరాశ‌కు గుర‌వుతాడు. దీనిద్వారా లైఫ్ లో స‌క్సెస్ దొర‌క‌ద‌ని డిసైడ్ అయ్యి.. లోక‌ల్ జ‌ట్టులోకి ప్ర‌వేశిస్తాడు. అయితే.. తాను ఫ్రాన్స్ వెళ్లాల‌ని ల‌క్ష్యం పెట్టుకుంటాడు సందీప్‌. ఇందుకోసం చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ఈ క్ర‌మంలోనే లావ‌ణ్య (లావ‌ణ్య త్రిపాఠి) ప‌రిచయం అవుతుంది. ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. త‌న ద్వారా హాకీ కోచ్ గా మారిపోతాడు. అయితే.. క్రీడాకారులు ఆడుకునే మైదానాన్ని ఆక్ర‌మించుకోవ‌డానికి కార్పొరేట్ కంపెనీలు ప్ర‌య‌త్నిస్తుంటాయి. దాన్ని సందీప్ కాపాడుతాడా? లేదా? అస‌లు ఫ్రాన్స్ వెళ్లాల‌ని ఎందుకు అనుకున్నాడు? కార్పొరేట్లు ఎలా ఎదుర్కొన్నాడు? అన్న‌ది మిగ‌తా క‌థ‌.

    క‌థ‌నంః ఈ సినిమా త‌మిళంలో వ‌చ్చిన ‘నాప్టే తునై’కి రీమేక్‌. అయితే.. పేరుకు రీమేకే అయినా.. దాదాపు 50 శాతానికి పైగా మార్పులు చేశారు. అంతేకాదు.. ఒరిజిన‌ల్ ను కూడా ద‌ర్శ‌కుడు డెన్నిస్ జీవ‌న్ తెర‌కెక్కించాడు. ఇదిలా ఉంచితే.. మైదానాన్ని కాపాడుకునే బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వ‌చ్చాయి. రాజ‌మౌళి నితిన్ తో తీసిన ‘సై’ సినిమా నేప‌థ్యం కూడా ఇదే. అయితే.. హాకీ బ్యాక్ డ్రాప్ ను తీసుకోవ‌డం కొత్త‌గా అనిపించింది. ఇండియాలో జాతీయ క్రీడ అంటే క్రికెట్ అనుకునేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి హాకీ ప్రాధాన్యాన్ని ఈ చిత్రం ద్వారా వివ‌రించారు. సినిమా మొద‌టి పార్టు క‌న్నా.. ద్వితీయార్థంలోనే ప‌ట్టు కొన‌సాగింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్ అవుతుంది. అయితే.. హీరోయిన్ ఖ‌చ్చితంగా ఉండాలి కాబ‌ట్టి, వారి మ‌ధ్య రొమాన్స్ కంటిన్యూ అవ్వాలి కాబ‌ట్టి జొప్పించిన‌ట్టుగా అనిపిస్తాయి కొన్ని స‌న్నివేశాలు. మొత్తానికి జాతీయ క్రీడ‌ను తెర‌పై అద్బుతంగా ఆవిష్క‌రిచేందుకు త‌న టాలెంట్ మొత్తం వాడేశాడు ద‌ర్శ‌కుడు.

    Also Read: రిసార్ట్ లో కల్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత

    పెర్ఫార్మెన్స్ః సందీప్ కిష‌న్ కు ఇది 25వ సినిమా. ఈ సిల్వ‌ర్ జూబ్లీ చిత్రంలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు సందీప్‌. సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై మోశాడు. ఇక‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి చ‌క్క‌గా అభిన‌యించింది. మిగిలిన రావు ర‌మేష్‌, ముర‌ళీ శ‌ర్మ త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర న‌టించారు. కామెడీ ఫ‌ర్వాలేద‌నిపించింది.

    మొత్తంగా.. హాకీ బ్యాక్ డ్రాప్ లో తెలుగులో వ‌చ్చిన తొలి సినిమా కావ‌డంతో ఆడియ‌న్స్ కు కొత్త ఫీల్ ను ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనికి ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయితే.. మంచి విజ‌యం సాధించే అవ‌కాశం ఉంది. ఇవాళ రిలీజ్ అయిన సినిమాల్లో రాజ్ త‌రుణ్ ‘ప‌వ‌ర్ ప్లే’ మాత్రమే చెప్పుకోదగిన సినిమా. దాని ఫలితం ఏంటన్నది తేలితే.. ఈ వీకెండ్ లో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ఏ రేంజ్ లో దూసుకెళ్తుందో తెలుస్తుంది.

    లాస్ట్ లైన్ః గోల్ కొట్టేలాగే క‌నిపిస్తోంది

    రేటింగ్ః 2.75

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్