https://oktelugu.com/

నెలకు రూ.3,300 కడితే అదిరిపోయే బైక్ మీ సొంతం.. ఎలా అంటే..?

యువత, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులలో చాలామంది కొత్త బైక్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా కొత్త బైక్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లు అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ సింగిల్ చానెల్ ఏబీఎస్ మోడల్ బైక్ ను తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఈ బైక్ ధర 1,47,000 రూపాయలు కాగా నెలకు 3,300 రూపాయల చొప్పున సులభ వాయిదాలలో చెల్లించి ఈ బైక్ ను సొంతం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 5, 2021 / 10:59 AM IST
    Follow us on

    యువత, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులలో చాలామంది కొత్త బైక్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా కొత్త బైక్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లు అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ సింగిల్ చానెల్ ఏబీఎస్ మోడల్ బైక్ ను తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఈ బైక్ ధర 1,47,000 రూపాయలు కాగా నెలకు 3,300 రూపాయల చొప్పున సులభ వాయిదాలలో చెల్లించి ఈ బైక్ ను సొంతం చేసుకోవచ్చు.

    Also Read: వాహనదారులకు శుభవార్త.. ఆన్ లైన్ లోనే ఆర్‌టీవో సేవలు..!

    అయితే ఈ బైక్ ను కొనుగోలు చేయాలనుకునే వాళ్లు కనీసం 15,000 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 1,32,000 మొత్తాన్ని నాలుగు సంవత్సరాల పాటు నెలకు 3,300 రూపాయల చొప్పున చెల్లించవచ్చు. ఎక్కువ మొత్తం డౌన్ పేమెంట్ చెల్లిస్తే ఈఎంఐ మొత్తాన్ని, లోన్ టెన్యూర్ ను సులభంగా తగ్గించుకోవచ్చు. 1,32,000 మొత్తానికి ఏదైనా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు.

    Also Read: ఉద్యోగులకు ఆ రెండు కంపెనీలు శుభవార్త.. ఫ్రీగా కరోనా వ్యాక్సిన్..?

    ప్రస్తుతం బ్యాంకులు బైక్ లోన్ లపై ఏకంగా 9 శాతానికి అటూఇటుగా వడ్డీ వసూలు చేస్తున్నాయి. సులభ వాయిదాలలో కేవలం 3,300 రూపాయలు చెల్లించడం ద్వారా అదిరిపోయే బైక్ మీ సొంతమవుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 127 కిలోమీటర్లు కాగా 197.55 సీసీ బీఎస్6 ఇంజిన్ తో తయారైంది. మూడు వేరియంట్లలో ఈ బైక్ అందుబాటులో ఉండగా నచ్చిన వేరియంట్ బైక్ ను కొనుగోలు చేయవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    సమీపంలోని టీవీఎస్ షోరూంను సంప్రదించి ఈ బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ బైక్ కు వాహనదారుల నుంచి పాజిటివ్ రివ్యూలు ఉండటం గమనార్హం.