ఆంధ్రా ఆడపడుచులకు ఏపీ సీఎం జగన్ శుభవార్త చెప్పారు. మహిళా దినోత్సవరం సందర్భంగా వారికి కానుక ప్రకటించారు. ఏపీలో మహిళళు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏపీ సీఎం జగన్ మహిళలకు మొబైల్ ఆఫర్ ఇచ్చారు. మొబైల్ ఫోన్ కొని దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే వారికి 10శాతం ఆఫర్ ధరపై ఇచ్చారు. వచ్చే సోమవారం మొబైల్ ఫోన్ కొన్న వారికి.. 10శాతం రాయితీని ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది.
ఏపీలో మహిళలకు ఆర్థిక , రాజకీయ స్వావలంబన కల్పించేలా జగన్ సర్కార్ ఈ ప్లాన్ చేసింది. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
నామినేటెడ్ పదవులు , పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. ఇప్పటికే జగన్ సర్కార్ హోంమంత్రి, డిప్యూటీ సీఎం వంటి కీలక పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించింది. మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహిళలకు మరింత భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే మొబైల్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.