https://oktelugu.com/

Barrelakka: బయటపడ్డ బర్రెలక్క మోసాలు, కన్నడ మీడియాలో కథనాలు… అసలు ఏం జరిగిందంటే?

బర్రెలక్క సోషల్ మీడియా వేదిక మోసాలు చేస్తుందట. పురుషులతో చాట్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తుందట. ఈ మేరకు కన్నడ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బర్రెలక్క ఓ సెన్సేషనల్ వీడియో విడుదల చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : August 23, 2024 / 11:58 AM IST

    Barrelakka

    Follow us on

    Barrelakka: బర్రెలక్క అలియా కర్నె శిరీష సోషల్ మీడియాలో పిచ్చ పాప్యులర్. తెలంగాణకు చెందిన ఈ యువతి డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం ఏమీ రాకపోవడంతో గేదెలను కొని మేపుకుంది. ఈ విషయం తెలియజేస్తూ ఆమె వరుస వీడియోలు చేసింది. డిగ్రీ చదివినా ఉద్యోగాలు లేవు ఫ్రెండ్స్. అందుకే బర్రెలు కాసుకుంటున్నా.. అంటూ శిరీష చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ విధంగా ఆమె బర్రెలక్కగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ సోషల్ మీడియా సెన్సేషన్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.

    నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బర్రెలక్క పోటీ చేసింది. బర్రెలక్క తరపున జేడీ లక్ష్మి నారాయణ ప్రచారం చేయడం కొసమెరుపు. ఎలాంటి నేపథ్యం లేని ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్కకు 5 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం బర్రెలక్క తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పోటీ చేసింది.

    జనాల్లో పాజిటివ్ ఇమేజ్ ఉన్న బర్రెలక్క మోసాలకు పాల్పడుతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు రావడం కలకలం రేపింది. బర్రెలక్క ఫేస్ బుక్ లో పురుషులతో చాట్ చేస్తూ వాళ్ళ వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తుందట. ఈ మేరకు కన్నడ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు బర్రెలక్క దృష్టికి వెళ్లడంతో ఆమె స్పందించారు. ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

    సదరు వీడియోలో బర్రెలక్క నేరుగా కర్ణాటకకు చెందిన ఎస్పీతో మాట్లాడింది. తన పేరున ఎవరో మోసాలకు పాల్పడుతున్నారని ఆమె వివరణ ఇచ్చింది. బర్రెలక్క పేరుతో ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో అనేక ఫేక్ అకౌంట్స్ ఉన్నాయట. తన ఫోటోలు వాడుకుంటూ ఎవరో ఈ నేరాలు చేస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అనవసరంగా నన్ను వివాదంలోకి లాగుతున్నారు. నేను పెళ్లి చేసుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఎవరో చేసిన తప్పుకు నేను బలి అవుతున్నాను… అని బర్రెలక్క ఆవేదన చెందింది.

    ఈ వివాదంలో బర్రెలక్కకు అభిమానులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. మీరు పోలీసులకు ఫిర్యాదు చేయండి. అధైర్య పడకండి. మీకు ఏమీ కాదని హామీ ఇస్తున్నారు. మరోవైపు బర్రెలక్క బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్ట్ చేస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ 8 లాంచ్ కానుంది. బర్రెలక్క హౌస్లో అడుగుపెడుతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. కాగా ఇటీవల బర్రెలక్క వివాహం చేసుకుంది. తనకు చిన్నప్పటి నుండి తెలిసిన చుట్టాల అబ్బాయితో ఆమె ఏడడుగులు వేశారు. బర్రెలక్క పెళ్లి ఫోటోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఇక బర్రెలక్క బిగ్ బాస్ షోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.