Trivikram Srinivas: సౌత్ ఇండియా లోనే మన టాప్ మోస్ట్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్..వెండితెర మీద ఈయన సృష్టించిన అద్భుత దృశ్యకావ్యాలను అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు..1999 వ సంవత్సరం లో వేణు తొట్టెంపూడి మరియు విజయ్ భాస్కర్ గారి దర్శకత్వం లో తెరకెక్కిన ‘స్వయంవరం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి స్టోరీ మరియు డైలాగ్ రైటర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు..ఆ సినిమా అప్పట్లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..దానితో త్రివిక్రమ్ గారికి అవకాశాల వెల్లువ కురిసింది..ఆ తర్వాత త్రివిక్రమ్ మరియు విజయ్ భాస్కర్ గారి కాంబినేషన్ లో ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి..వాటిల్లో మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలకు ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లిస్ట్ లో చోటు దక్కాయి..అలా డైలాగ్/ స్క్రీన్ ప్లే రైటర్ గా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి మెగా ఫోన్ పట్టింది 2002 వ సంవత్సరం లో విడుదలైన నువ్వే నువ్వే అనే సినిమాకి.

ఈ సినిమా ఇప్పటికి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది..తరుణ్ మరియు శ్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..త్రివిక్రమ్ ని డైరెక్టర్ గా నిలబెట్టింది..ఇక ఆ సినిమా తర్వాత ఆయన ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘అతడు’ సినిమా తీసాడు..అది కూడా సూపర్ హిట్ అయ్యింది..ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా ,అత్తారింటికి దారేది వంటి సినిమాలు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొత్తగా, మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి చిత్రం మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..మహేష్ తో కూడా అతడు వంటి సూపర్ హిట్ ని తీసిన త్రివిక్రమ్, ఖలేజా వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా కూడా తీసాడు..ఇక అల్లు అర్జున్ తో తీసిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి మరియు అలవైకుంఠపురం లో వంటి చిత్రాలు ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే.

ఇక ఆ తర్వాత నితిన్ తో అ..ఆ మరియు జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సామెత వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసాడు..ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు..ఇటీవలే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది..ఇన్నేళ్ల త్రివిక్రమ్ గారి సినీ కెరీర్ లో ఆయన ఒక స్టార్ హీరో రేంజ్ స్టార్ స్టేటస్ ని సంపాదించాడు..ముఖ్యంగా ఓవర్సీస్ మరియు నైజాం వంటి ప్రాంతాలలో అయితే కేవలం త్రివిక్రమ్ గారి పేరు ని చూసి థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది..అలాంటి ఇమేజి ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ భవిష్యత్తులో ఇంకా ఏ రేంజ్ వెళ్ళబోతున్నాడో చూడాలి.