https://oktelugu.com/

Dogs: కుక్కలు టైర్లపై మూత్ర విసర్జన ఎందుకు చేస్తాయో తెలుసా?

సాధారణంగా మన మాట్లాడుకోవడం ద్వారా సమాచారాన్ని చేరవేసుకుంటాం. ఫోన్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మన కమ్యూనికేషన్‌కు దోహదపడతాయి. అయితే జంతువులు మాట్లాడలేవు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 4, 2024 / 11:29 AM IST

    Dogs

    Follow us on

    Dogs: జీవాల్లో అత్యంత విశ్వాసమైన జంతువుగా క్కులకు గుర్తింపు ఉంది. మనతో కలిసి జీవించే ఈ కుక్కల అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తాయి. మనం నేర్పించే పనులు నేర్చుకుంటాయి. వాసనతో రాబోయే ప్రమాదాలను గుర్తించి మనల్ని ముందే హెచ్చరిస్తాయి. కొన్ని రకాలైన సంకేతాలతో ప్రకృతి వైపరీత్యాలను గుర్తిస్తాయి. సుచి శుభ్రతలోనూ కుక్కలు ముందుంటాయి. అయితే కుక్కలు ఎక్కువగా మూత్ర విసర్జనను టైర్లపై, విద్యుత స్తంభాలపై, గోడలపై చేస్తుంటాయి. ఇలా చేయడానికి ఓ కారణం ఉందంటున్నారు నిపుణులు.

    కమ్యూనికేషన్‌ కోసం..
    సాధారణంగా మన మాట్లాడుకోవడం ద్వారా సమాచారాన్ని చేరవేసుకుంటాం. ఫోన్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మన కమ్యూనికేషన్‌కు దోహదపడతాయి. అయితే జంతువులు మాట్లాడలేవు. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలియవు. అందుకే అవి కమ్యూనికేషన్‌ కోసం మరో మార్గం అనుసరిస్తాయి. వివిధ జాతులను బట్టి అవి కమ్యూనికేట్‌ చేసుకునే విధానం ఉంటుంది. మన చుట్టూ ఉండే కుక్కలు కమ్యూనికేషన్‌ కోసం కార్లు, బైక్‌ల టైర్లు, విద్యుత స్తంభాలపై మూత్ర విసర్జన చేస్తాయి. భూమిపై మూత్ర విసర్జన చేస్తే అది వెంటనే గాలిలో కలిసిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు కుక్కలు వాహనాలు, వస్తువుల ఉపరితలంపై మూత్ర విసర్జన చేస్తాయట. తమ స్థానాన్ని, తాము తిరిగే ప్రదేశాన్ని, నివసించే ఏరియాను ఇతర కుక్కలకు తెలియజేయడానికి ఇలా విద్యుత్‌ స్తంభాలు, కార్లు, బైక్‌ల టైర్లపై మూత్ర విసర్జన చేస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. అక్కడకు ఏ కుక్క వచ్చినా.. అది అక్కడి కుక్కల సంచారం గుర్తిస్తుంది. ఇతర కుక్కలు తమ సహచరులను గుర్తించేందకు మూత్రం వాసన ఉపయోగపడుతుందట.