Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. కొన్నాళ్లుగా ఆమె వివాహంపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తన క్లాస్ మేట్ అయిన వ్యాపారవేత్తను కీర్తి సురేష్ వివాహం చేసుకుబోతున్నారనే ప్రచారం జరిగింది. కేరళలో రిసార్ట్స్ బిజినెస్ చేస్తున్న అతన్ని కీర్తి సురేష్ ప్రేమించారు. ఇరు కుటుంబాల సభ్యులు కూడా ఈ పెళ్లికి అంగీకారం తెలిపారంటూ వార్తలు వినిపించాయి అయితే ఈ కథనాలను కీర్తి సురేష్ తల్లి ఖండించారు. కీర్తి సురేష్ పెళ్లి కుదర్లేదు. తాను ఎవరితో రిలేషన్ లో లేదన్నారు.
అలాంటిది ఏదైనా ఉంటే కీర్తి ముందు కుటుంబ సభ్యులకు చెబుతుందన్నారు. తాజాగా మరోసారి ఆమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఓ వ్యక్తితో కీర్తి సురేష్ కలిసి ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అతనితో అత్యంత సన్నిహితంగా కీర్తి సురేష్ ఉన్న నేపథ్యంలో అతడు ఆమె లవర్ కావచ్చంటున్నారు. ఆ వ్యక్తి వివరాలు పరిశీలిస్తే పర్హాన్ బీన్ లియాకత్ అట. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారి అని సమాచారం. కీర్తి సురేష్ ఇతనిలో రిలేషన్ లో ఉన్నారు. త్వరలో వివాహం అంటూ కథనాలు వెలువడుతున్నాయి.
కానీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. హీరోయిన్ గా కీర్తి ఫుల్ బిజీ. అరడజను చిత్రాల వరకు ఆమె చేతిలో ఉన్నాయి. ఇటీవల కీర్తి తెలుగులో నటించిన సర్కారు వారి పాట, దసరా సూపర్ హిట్ కొట్టాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది. మహానటి తర్వాత కీర్తికి చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఆమె దాహాన్ని మహేష్, నాని చిత్రాలు తీర్చాయి. ఈ రెండు చిత్రాలు భిన్నమైన పాత్రల్లో కీర్తి సురేష్ నటించారు.
ప్రస్తుతం చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ మూవీలో నటిస్తున్నారు. భోళా శంకర్ లో కీర్తిది చెల్లి పాత్ర కావడం విశేషం. చిరంజీవికి సిస్టర్ గా కీలక రోల్ చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. భోళా శంకర్ దసరా కానుకగా విడుదల కానుంది. రివాల్వర్ రీటా, రఘుతాతా చిత్రాల్లో కీర్తి సురేష్ నటిస్తున్నారు.