NIA Investigation In Hyderabad: ఒక మనిషిని చంపడం, ఒక సమూహాన్ని విచ్ఛిన్నం చేయడం, బాంబులు వేసుకొని వినాశనాన్ని సృష్టించడం అది కచ్చితంగా ఉన్మాదానికి కారణం అవుతుంది.. ఆ ఉన్మాదం తారస్థాయికి చేరి ఉగ్రవాదంగా మారుతుంది.. ఈ ఉగ్రవాదానికి సంబంధించిన నష్టాలను, ఇబ్బందులను భారతదేశం చవి చూస్తూనే ఉంది. దీని ద్వారా జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాన్ని భరిస్తూనే ఉంది. ఈ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఏదో ఒక రూపంలో ఈ ఉగ్ర జాడలు వెలుగు చూస్తుండడం రేపుతోంది. ఇక హైదరాబాదులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జరుపుతున్న దాడుల్లో వెలుగు చూస్తున్న వాస్తవాలు విస్మయాన్ని కలుగజేస్తున్నాయి. హిజ్బుత్ తహ్రీర్ సంస్థ వ్యవస్థాపకుడు, హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ సలీం, భోపాల్ కు చెందిన యాసిర్కాన్ కు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పేరేపిత ఉగ్రవాదముకలతో ఉన్నట్టు మధ్యప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తులో తేలింది. అంతేకాదు వీరు పలుమార్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను సందర్శించినట్లు అది గుర్తించింది. వీరు దేశంలో మతమార్పిళ్ళు, లవ్ జిహాద్ తోపాటు వేరువేరు నగరాల్లో విధ్వంశాలకు స్లీపర్ సేల్స్ తయారు చేయడమే వీరి వీధి అని తేల్చింది. అంతేకాదు జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా రంగంలోకి దిగింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా.. దీనిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి బదులు చేసే అవకాశాలు ఉన్నాయి.
11 మంది అరెస్ట్
ఇక ఈ కేసు కు సంబంధించి మధ్యప్రదేశ్లో 11 మంది, హైదరాబాదులో ఆరుగురు అరెస్ట్ అయ్యారు. ఇక హైదరాబాదులో జరిగిన దాడుల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కి చెందిన దక్కన్ మెడికల్ కాలేజీలో విభాగానికి హెచ్ఓడీ గా ఉన్న మహమ్మద్ సలీం అలియాస్ సౌరబ్ రాజ్ తో పాటు అబ్దుల్ రెహమాన్ అలియాస్ దేవి ప్రసాద్ పాండా, మహమ్మద్ అబ్బాస్ అలీ అలియాస్ బస్కా వేణు కుమార్, షేక్ జునైద్, సల్మాన్, మహమ్మద్ హమీద్ అరెస్ట్ అయ్యారు. వీరిని 11న మధ్యప్రదేశ్ కోర్టులో హాజరు పరచగా.. 19 వరకు అంటే ఎనిమిది రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో హైదరాబాదులో కేసు రీ_ కన్స్ట్రక్షన్ కోసం ఈ ఆరుగురు తో పాటు మధ్యప్రదేశ్ లో అరెస్టు చేసిన జిమ్ ట్రైనర్, హిజ్బుత్ తహ్రీర్ సహ వ్యవస్థాపకుడు యాసిర్ ను కూడా మధ్యప్రదేశ్ పోలీసులు తీసుకొచ్చారు. ఈ మూడు బృందాలతో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు తెలిసింది.
ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో
ఇక యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు చాంద్రాయణగుట్ట, బాబా నగర్, పలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ ఆరుగురితో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులను విచారించారు. ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు చాంద్రాయణగుట్టలోని హఫీజ్ బాబా నగర్, కూడా ప్రాంతాలకు చెందినవారు. వీరిద్దరు కూడా సాలెం నిర్వహించిన కార్యక్రమాలకు హాజరైనట్టు తెలుస్తోంది.. వీరు ఈ కేసులో అత్యంత కీలకం కాబట్టి, వారి వాంగులాన్ని నమోదు చేసేందుకు మధ్యప్రదేశ్ తీసుకెళ్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
విధ్వంసానికి కుట్ర
హిజ్బుత్ తహ్రీర్ ముఠా హైదరాబాద్ నగరంలో విధ్వంసాలతోపాటు.. మతమార్పిళ్లపైనే ప్రధానంగా దృష్టి సారించారు.
ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్, తెలంగాణలోని హైదరాబాద్‌లో మొత్తం 17 అరెస్టులు జరిగాయి. వీరిలో సలీం, రెహ్మాన్, అబ్బాస్ తోపాటు.. మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఐదుగురు హిందూమతం నుంచి ఇస్లాంకు మారాయి. ‘‘సౌరభ్‌రాజ్ వైద్య భోపాల్‌లోని బరాసియాకు చెందిన వాడు. 2009లో పెళ్లి చేసుకున్నాడు. 2011లో మతంమారి.. మహమ్మద్ సలీంగా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేరాడు. హిజ్బుత్ తాహీర్‌లో సలీం కీలక వ్యక్తి. ఇతనికి ఒక్క భోపాల్‌లోనే 100 మంది దాకా అనుచరులున్నారు. భోపాల్‌లో అరెస్టు చేసిన 10 మందిలో ఐదుగురు మతం మారిన వారు కాగా.. మిగతా వారిలో ముగ్గురు లవ్‌జిహాద్‌కు పాల్పడ్డట్లు తేలింది. వీరిలో జిమ్‌ట్రైనర్ యాసిర్‌కు హైదరాబాద్‌తో సంబంధాలున్నాయి. అందుకే అతణ్ని కూడా హైదరాబాద్‌లో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లాం’’ అని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి.
లవ్ జిహాద్
కాగా.. హిజ్బుత్ తహ్రీర్ ప్రధాన లక్ష్యం లవ్ జిహాద్ అని.. వారి ఆటలను మధ్యప్రదేశ్‌లో సాగనిచ్చేది లేదని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సోమవారం వ్యాఖ్యానించారు. సలీం అలియాస్ సౌరభ్ స్వస్థలం మధ్యప్రదేశ్ భోపాల్‌లోని బరాసియా. అతని తల్లిదండ్రులు డాక్టర్ అశోక్ జైన్, వాసంతి జైన్ ఇప్పటికీ బరాసియాలోనే నివసిస్తున్నారు. ఇస్లాం ప్రవచనకర్త జకీర్ నాయక్ ఉపన్యాసాల వల్లే తమ కుమారుడు ఇలా తయారయ్యాడని వారు ఆరోపించారు. ‘‘చదువుకునే రోజుల్లో డాక్టర్ కమల్‌అనే వ్యక్తితో సౌరభ్‌కు పరిచయం ఏర్పడింది. సౌరభ్‌కు కమల్ జకీర్‌నాయక్ ఉపన్యాసాలను గురించి చెప్పేవాడు. 2010లో కమల్ మాటలను విని సిరియా వెళ్లాలనుకున్నాడు. ఆ తర్వాత జకీర్‌నాయక్‌కు అత్యంత సన్నిహితులను కలిసేవాడు. 2011లో కమల్, మరికొందరు మా కుమారుడు, కోడలికి ఏదో నేర్పించి, చదవి.. ‘ఇక మీరు ముస్లింలుగా మారిపోయారు’ అని చెప్పారు. ఆ తర్వాత మా కుమారుడు, కోడలికి ఎంత చెప్పినా వినలేదు. దాంతో వారిద్దరినీ 2014లో ఇంట్లోంచి వెళ్లగొట్టాల్సి వచ్చింది’’ అని వివరించారు.