Vijay Deverakonda's film
Vijay Devarakonda : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, సరైన సక్సెస్ లేక మరో లీగ్ కి వెళ్లకుండా ఇంకా మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతున్న వారిలో ఒకరు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో యూత్ ఆడియన్స్ లో ఈయన సంపాదించుకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరోయిన్స్ తక్కువ సమయంలో స్టార్స్ అవ్వడం మనం చూసాము కానీ, హీరోలలో కేవలం రెండు, మూడు సినిమాలకే స్టార్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం కేవలం విజయ్ దేవరకొండ విషయంలోనే జరిగింది. అయితే ‘టాక్సీ వాలా’ చిత్రం తర్వాత ఈ కుర్ర హీరో చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లైగర్’, ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు కూడా బెడిసికొట్టాయి. అందుకే ఈసారి కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.
అందులో భాగంగానే జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘సామ్రాజ్యం'(#VD12) అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు టాక్, రేపు ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ టైటిల్ టీజర్ కి తెలుగు లో వాయిస్ ఓవర్ ని జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) అందించాడు. వాయిస్ ఓవర్ ఇస్తున్న సమయంలో తీసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది . ఈ ఫొటోలో ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ సరికొత్త లుక్స్ ని చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ గుండు లుక్ లో, అదే విధంగా ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ లుక్ లో కనిపించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కనిపిస్తున్న లుక్ ‘వార్ 2 ‘ కి సంబంధించినది అని తెలుస్తుంది.
ఇకపోతే హిందీ వెర్షన్ టీజర్ కి సూపర్ స్టార్ రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందిస్తుండగా, తమిళ వెర్షన్ టీజర్ కి హీరో సూర్య వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. ఇలా చాలా గ్రాండ్ గా ఈ టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ టీజర్ తో విజయ్ దేవరకొండ భారీ కం బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు బలమైన నమ్మకం పెట్టుకున్నారు. మీనాక్షి చౌదరి , భాగ్యశ్రీ భొర్సే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు. ‘గేమ్ చేంజర్(Game Changer)’ చిత్రం సమయంలో రామ్ చరణ్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ఇదేనట. కానీ ఆయన ఆ సినిమా కోసం, ఈ చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోయాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ ని విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడు గౌతమ్ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.