Salaar
Salaar: ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో భారీగా వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు సలార్… ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ గానీ, ఫస్ట్ సింగిల్ గా వచ్చిన పాట గాని అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్ మీద వచ్చిన పాట అయితే విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది కే జి ఎఫ్ లో అమ్మ పాటకి ఎంతైతే క్రేజ్ వచ్చిందో అంతకు మించి ఈ సాంగ్ కి క్రేజ్ రావడం అనేది ఈ సినిమాని మరో మెట్టు పైకెక్కించిందనే చెప్పాలి.
ఇక డిసెంబర్ 22వ తేదీ కోసం ప్రతి ఒక్కరూ కన్నుల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇక ఇలాంటి క్రమంలోనే సలార్ సినిమా నుంచి మరొక పవర్ ఫుల్ డైలాగ్ లీకైనట్టుగా తెలుస్తుంది. అదేంటి అంటే ప్రభాస్ ఫ్రెండ్ అయిన పృథ్వి రాజ్ సుకుమారన్ ని చంపడానికి అర్థరాత్రి కొందరు రౌడీలు వచ్చినప్పుడు వాళ్లని చూసిన ప్రభాస్ ( దేవా) తన ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి వచ్చి వాళ్ళతో ఒక భారీ డైలాగ్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేంటి అంటే “ఈ కోటలోకి ఎంటర్ అవ్వాలంటే గేట్లు దాటాలి, అడ్డుగా ఉన్న సైన్యాన్ని దాటాలి, కానీ ఈ దేవా గాడి ఫ్రెండ్ ని తాకాలంటే వాడి ముందు నిలబడ్డా ఈ దేవా గాడి గుండెని దాటాలి రా”… అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్ ని చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే సినిమాలో ఇది బాగా ఎలివేట్ అయ్యే డైలాగ్ అని చిత్ర యూనిట్ చెబుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ప్రభాస్ అభిమానులు బీభత్సమైన రచ్చ చేస్తుంటే ఈ డైలాగుని థియేటర్ లో చూసిన తర్వాత వాళ్ళ అరుపులకి హద్దే ఉండదు అని తెలుస్తుంది. నిజానికి ప్రభాస్ నోట్లో నుంచి ఈ డైలాగుని వింటే మాత్రం ప్రతి ఒక్క అభిమాని అనే కాదు సినిమా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా పూనకాలు వస్తాయి.
అంత పవర్ ఫుల్ డైలాగ్ ని ప్రభాస్ చేత చెప్పిస్తున్న ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ అభిమానులు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అయి హిట్ కొట్టడం పక్క అంటూ అతని అభిమానులు దృఢ సంకల్పంతో ఉన్నారు…ఇంతకు ముందు మూడు సినిమాలతో ప్లాపుల్లో ఉన్న ప్రభాస్ కి ఈ సినిమా సాలిడ్ హిట్ ఇవ్వబోతుంది…