spot_img
Homeఎంటర్టైన్మెంట్Riya Kumari Jharkhand: దొంగల చేతిలో హతమైన హీరోయిన్... భర్త మాస్టర్ ప్లాన్ అని అనుమానాలు!

Riya Kumari Jharkhand: దొంగల చేతిలో హతమైన హీరోయిన్… భర్త మాస్టర్ ప్లాన్ అని అనుమానాలు!

Riya Kumari Jharkhand: జార్ఖండ్ నటి రియా కుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను దొంగలు తలపై తుపాకీతో కాల్చి హత్య చేశారు. భర్త ముందే ఈ సంఘటన జరిగింది. హౌరా నేషనల్ హైవే 16 పై ఈ సంఘటన చోటు చేసుకుంది. సినిమా సీన్ తరహాలో జరిగిన ఈ మర్డర్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జార్ఖండ్ నుండి రియా కుమారి భర్త ప్రకాష్ కుమార్,రెండేళ్ల పాపతో పాటు కారులో కలకత్తా వెళుతున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న ప్రకాష్ కుమార్ మార్గం మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఆపారు.

Riya Kumari Jharkhand
Riya Kumari Jharkhand

ఆ సమయంలో ముగ్గురు దుండగులు ప్రకాష్ కుమార్ పై దాడికి దిగారు. అతని దగ్గర ఉన్న డబ్బులు, బంగారు వస్తువులు లాక్కొంటుండగా… రియా కుమారి ప్రతిఘటించారు. వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురిలో ఒక దుండగుడు రియా కుమారి పాయింట్ బ్లాక్ లో షూట్ చేశారు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. డబ్బులు, విలువైన వస్తువులు తీసుకొని ముగ్గురు దొంగలు అక్కడి నుండి పారిపోయారు.

డిసెంబర్ 28 బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అక్కడి నుండి హెల్ప్ కోసం మూడు కిలోమీటర్లు కోసం ప్రయాణం చేసినట్లు ప్రకాష్ కుమార్ తెలిపారు. షూట్ చేయబడిన రియా కుమారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రకాష్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Riya Kumari Jharkhand
Riya Kumari Jharkhand

అయితే రియా కుమారిని భర్త ప్రకాష్ కూడా పథకం ప్రకారం హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రియా హత్యా సంఘటన గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పలు అనుమానాలకు కారణం అవుతుంది. ప్రకాష్ కుమార్ మాటలు పొంతన లేకుండా ఉన్నాయని సమాచారం. రియా కుమారి మర్డర్ ని ఆయన ఇలా తెలివిగా ప్లాన్ చేశాడేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. రియా స్థానిక భాషలో నటిగా ఉన్నారు. ఆమె భర్త ప్రకాష్ కుమార్ నిర్మాత అని సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో అసలు నిజాలు బయటకు రానున్నాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version