https://oktelugu.com/

Pushpa 2: The Rule : పుష్ప 2 నుంచి భారీ అప్డేట్…ఈసారి మామూలుగా ఉండదు…

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 27, 2024 / 09:58 PM IST

    Pushpa 2: The Rule

    Follow us on

    Pushpa 2: The Rule : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్..ఈయన గంగోత్రి సినిమా తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన కూడా ఆర్య సినిమా నుంచి తను వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన ప్రతి సినిమా కోసం చాలా బాగా కష్టపడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

    ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప2 సినిమాతో మరోసారి మనల్ని అలరించడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన “పుష్ప పుష్ప పుష్ప” అనే సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇంకా దాని బాటలోనే పుష్ప 2 సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా ఒక పాటను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

    “సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి” అనే పాటని మెలోడీ క్విన్ గా పేరు సంపాదించుకున్న ‘శ్రేయ ఘోషల్’ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం,బెంగాలీ భాషల్లో ఈ పాటని తను పాడినట్టుగా సినిమా నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇక మొత్తానికైతే ఫస్ట్ సింగిల్ తో ఒక సంచలనాన్ని సృష్టించిన పుష్ప 2 సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా మరొక సాంగ్ రావడానికి రెడీగా ఉందనే వార్తను తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానులు అందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్లిద్దరూ కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ను కనక అందుకుంటే టాప్ స్టార్లుగా పేరు సంపాదించుకుంటారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాకు ఉన్న హైప్ రీ మధ్య కాలం లో మరే సినిమా కు లేదు అనేది వాస్తవం….