Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా 13 వారాలు పూర్తి చేసుకుంది. అయితే 14వ వారంలో అనూహ్యంగా విన్నర్ ఓటింగ్ లైన్స్ పారంభించారు. ప్రతి సీజన్ లో 15వ వారం వచ్చిన ఓటింగ్ ని బట్టి విన్నర్ ని డిసైడ్ చేస్తారు. ఈసారి బిన్నంగా రెండు వారాల్లో వచ్చిన ఓటింగ్ పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇందులో తక్కువ ఓట్లు సాధించిన ఇంటి సభ్యులు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఈ నేపథ్యంలో కామన్ మ్యాన్ గా వచ్చి టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని ఓడించే కుట్ర జరుగుతుందని తెలుస్తుంది .
14వ వారం ఫినాలే ఓటింగ్ సంచలనంగా నమోదవుతుంది. ముఖ్యంగా ప్రశాంత్ హాట్ స్టార్ పోలింగ్ తో పాటు మిస్డ్ కాల్స్ లోనూ టాప్ లో ఉన్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. దీంతో ప్రశాంత్ టైటిల్ విన్నర్ అని అందరూ అంటున్నారు. కాగా గ్రాండ్ ఫినాలే సమయం మరింత దగ్గర పడింది. డిసెంబర్ 17వ తారీఖున విన్నర్ ని కూడా ప్రకటించబోతున్నారు. దీంతో ఈ రెండు వారాల ఓట్లు కీలకంగా మారాయి.
ఈ క్రమంలో మిస్డ్ కాల్స్ కి సంబంధించి భారీ మోసం బయటపడింది. దీని వల్ల ప్రశాంత్ కి తీవ్ర నష్టం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బిగ్ బాస్ టీం ఇచ్చిన ప్రశాంత్ మిస్డ్ కాల్ నెంబర్ సరిగా పని చేయడం లేదు. దీన్ని కావాలని కొందరు వర్క్ చేయకుండా చేశారని తాజాగా ఓ చర్చ తెర పైకి వచ్చింది. అంతే కాకుండా కొందరు ప్రూఫ్ తో సహా వీడియోలు షేర్ చేస్తున్నారు.
వీటిలో నిజంగానే ప్రశాంత్ నెంబర్ కి కాల్ కలవడం లేదు. కానీ అమర్ కి చేస్తే వెంటనే కనెక్ట్ అవుతుంది. తాజాగా బయటకి వచ్చిన వీడియోలో పల్లవి ప్రశాంత్ ఓడించేందుకు కుట్ర జరుగుతున్నట్లు చాలా మంది బిగ్ బాస్ నిర్వాహకులపై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నాగార్జున దృష్టికి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.ఇది కావాలని చేస్తున్న మోసమా .. లేక టెక్నికల్ ప్రాబ్లమా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.