Box Office: గత వారం బాక్సాఫీస్ పరిస్థితి అసలు బాగాలేదు. ఎందుకంటే.. గత వీకెండ్ విడుదలైన ఎనిమిది సినిమాల్లో ఆరు సినిమాలకు పోస్టర్ ఖర్చులకు కూడా డబ్బులు రాలేదు. ఇక మిగిలిన రెండు సినిమాలు ‘లక్ష్య, గమనం’. నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన లక్ష్య సినిమాకి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఈ సినిమాతో నాగశౌర్య మార్కెట్ పై కూడా క్లారిటీ వచ్చినట్టు అయింది.

ఇప్పుడు శౌర్యకి మళ్లీ ‘ఛలో’ లాంటి సాలిడ్ హిట్ సినిమా పడాలి. లేకపోతే.. ఉన్న మార్కెట్ కూడా దెబ్బ తినే పరిస్థితి వస్తుంది. నిజానికి శౌర్య పై రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. ఎక్కువగా కామెడీ సినిమాలు శౌర్యకు బాగా కలిసి వచ్చాయి. మరి భవిష్యత్తులో శౌర్య కామెడీ చిత్రాల పై ఫోకస్ చేయడం మంచిది.
గతంలో శౌర్య చేసిన కామెడీ చిత్రాలన్నిటికీ డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, నాగ శౌర్య యాక్షన్ జోనర్ లో చేసిన ప్రయత్నాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే లక్ష్య కూడా ఏ మాత్రం సందడి చేయకుండా సైలెంట్ గా సైడ్ అయిపోయింది. మరి ఈ సినిమా అనుభవంతో శౌర్య తన కథల ఎంపిక పై ఫోకస్ మారుస్తాడేమో చూడాలి.
ఇక మాజీ హీరోయిన్ శ్రియ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా ‘గమనం’. ఈ చిత్రానికి డే 1 నుండి దాదాపు జీరో కలెక్షన్స్ మాత్రమే వస్తున్నాయి. మొదటి రోజే కలెక్షన్స్ రాలేదు అంటే.. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కల గురించి ముచ్చటించుకోవడం వృధా. ఏది ఏమైనా ప్రస్తుతం తెలుగు బాక్సాఫీస్ దగ్గర అఖండ ఒక్కటే తనదైన శైలిలో కలెక్షన్స్ ను రాబడుతుంది.
Also Read: Virata Parvam Movie: రానా, సాయి పల్లవి నటిస్తున్న “విరాట పర్వం” మూవీ నుంచి ఓ గుడ్ న్యూస్…
అఖండ సినిమా రెండో వారంలోకి వచ్చినా కూడా.. ఇంకా చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. దీనిబట్టి మరో స్ట్రాంగ్ వీకెండ్ అఖండకు కలిసి వచ్చేసినట్లే. ఇక యూఎస్ లోనూ అఖండ సినిమా 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.
Also Read: Mahesh Babu: జూబ్లీహిల్స్ లో ఖరీదైన ఇల్లు కొన్న మహేష్ బాబు… ఎన్ని కోట్ల రూపాయలంటే