Rashi Khanna: బబ్లీ హీరోయిన్ రాశి ఖన్నా కెరీర్ గ్రాఫ్ మొదటి నుంచి మిగిలిన హీరోయిన్స్ కంటే భిన్నంగా వస్తూ ఉంది. హిట్లు ఉండవు, ఫేడ్ అవుట్ దశలోకి వెళ్ళిపోతుంది. ఇక ఛాన్స్ లు రావడం ఆగిపోయాయి అనుకున్న సమయంలో.. మళ్ళీ సడెన్ గా రాశి ఖన్నాకి వరుస ఛాన్స్ లు వస్తాయి. మరి ఈ ఛాన్స్ లు వెనుక ఎవరు ఉన్నారో తెలియదు గానీ, రాశి ఖన్నాకి మాత్రం కెరీర్ అయిపోయింది అనే పరిస్థితిలోనే కెరీర్ మొదలవుతూ వస్తోంది.

ఏది ఏమైనా రాశి ఖన్నా గ్రేటే. టాలెంట్ లేకపోయినా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఎక్స్ పోజింగ్ తో తన గ్లామర్ తో మొత్తానికి బండిని నడిపిస్తోంది. పైగా ఈ బబ్లీ బ్యూటీ టాలీవుడ్ లో ఛాన్స్ లతో పాటు బాగా క్యాష్ చేసుకుంటుంది. నిజానికి గత నాలుగేళ్లుగా తెలుగులో రాశి ఖన్నాకు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు.
తన హవా టాలీవుడ్ లో తగ్గుముఖం పట్టింది అని అర్ధం అవ్వగానే రూట్ మారుస్తోంది. కొన్ని నెలల పాటు తమిళంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ చేస్తూనే.. తెలుగులోని తన సన్నిహిత హీరోలతో, దర్శకులతో నిత్యం టచ్ లో ఉంటుంది. చివరకు ఛాన్స్ లు పట్టేస్తోంది. ఏమైనా చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల సరసన వరసగా అవకాశాలు అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశి.
అసలు ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా తర్వాత బిగ్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ ల కోసం ఆ మధ్య కొన్ని మీడియం రేంజ్ సినిమాలను కాదనుకుంది. అయితే, స్టార్ హీరోలు మాత్రం రాశికి ఎందుకో అవకాశాలు ఇవ్వలేదు. దాంతో తెలుగులో ఏవరేజ్ రేంజ్ హీరోలతో మాత్రమే రాశీ నటించగలిగింది. ఇక అలాంటి సినిమాలు కూడా తనకు రావడం లేదని గ్రహించి తెలుగుకి గ్యాప్ ఇచ్చి తమిళంకి వెళ్ళింది.
Also Read: Virata Parvam Movie: రానా, సాయి పల్లవి నటిస్తున్న “విరాట పర్వం” మూవీ నుంచి ఓ గుడ్ న్యూస్…
తమిళంలో జయం రవి, విశాల్, విజయ్ సేతుపతి లాంటి హీరోలతో చెప్పుకోదగిన స్థాయిలో సినిమాలు చేసింది. ఇప్పుడు అక్కడ అవకాశాలు రావడం లేదు. అందుకే ఇప్పుడు తెలుగులో రాశి ఖన్నా ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ వరుసగా చైతు, గోపీచంద్, నాని లాంటి హీరోల సినిమాల్లో ఛాన్స్ లను అందుకుంది. మొత్తానికి అటు తమిళం ఇటు తెలుగు మధ్యలో రాశిఖన్నా అన్న మాదిరిగా ఉంది ఆమె కెరీర్.
Also Read: Mahesh Babu: జూబ్లీహిల్స్ లో ఖరీదైన ఇల్లు కొన్న మహేష్ బాబు… ఎన్ని కోట్ల రూపాయలంటే