
‘దిల్ రాజు’ సామాన్యుల కుటుంబంలో పుట్టి.. సినిమా అంటే ఏంటో తెలియకుండానే సినిమాలను పంపిణి చేసి.. నష్టపోయి.. కష్టపడి.. మధ్యలో అదృష్టం కలిసి వచ్చి.. నిర్మాతగా సక్సెస్ అయి.. ఆ తరువాత కాలంలో టాలీవుడ్ లో కీలక వ్యక్తిగా మారిపోయాడు. అప్పటి నుండి దిల్ రాజు గురించి చెప్పాలంటే.. ఆయన టాలీవుడ్ లో అగ్ర నిర్మాత.. థియేటర్ల పై అధికారం సాధించిన ఆ నలుగురిలో ముఖ్యమైన ప్రముఖుడు.. పైగా ఆయన సినిమా పంపణీదారులలోనే ఒక శక్తి.. దిల్ రాజు విషయంలో ఇలా సాగే ఇలాంటి బిల్డప్ మాటలు ఇక రాబోయే రోజుల్లో చెప్పుకోవడానికి కుదరదనేది ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
Also Read: ‘బుర్రిపాలెం’ మనసు గెలిచిన మహేశ్ బాబు
ఎంత గొప్ప వ్యక్తి అయినా.. ఏదొక రోజు తన శక్తిని కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పుడు దిల్ రాజు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన తన చేతిలో పెట్టుకున్న థియేటర్లను మెయింటైన్ చెయ్యలేక కాస్త ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నాడట. ఓన్ డబ్బులను థియేటర్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తోందట. సరే ఇప్పటికిప్పుడు థియేటర్లను వదిలించుకునే ఆలోచన ఉన్నా.. కొన్ని అగ్రిమెంట్లు దృష్ట్యా అది కుదరదు అట. అందుకే ఏమి చేయాలా అని దిల్ రాజు కాస్త అయోమయంలో ఉన్నాడట ప్రస్తుతం. ఇన్నేళ్లు అగ్ర నిర్మాతగా ఈ తరం సినీ నిర్మాణ విభాగానికి ప్రతినిధిగా ఉన్న దిల్ రాజు.. మొత్తానికి కరోనాతో తన ప్రాభవాన్ని ప్రభావాన్ని పోగొట్టుకునేలా ఉన్నాడు.
Also Read: వైరల్ ఫొటో: ఇలా ఉన్నాడేంటి? మాసిన గడ్డంతో పవర్ స్టార్
పైగా అగ్ర హీరోలతో కూడా దిల్ రాజు ఈ మధ్య సమస్యలు ఎక్కువైపోయాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దానికి కారణం ఈ మధ్య స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నాన్-థియోటర్స్ రైట్స్ తీసుకుంటూ నిర్మాతలకు లాభాలు వచ్చే ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. ఒక సూపర్ స్టార్ తో గత సినిమా బిజినెస్ విషయంలోనూ దిల్ రాజు దీనివల్లే కాస్త నష్టపోయారు కూడా. అందుకే సినిమా బిజినెస్ విషయంలో స్టార్ హీరోలను ఎక్కువుగా ఇన్ వాల్వ్ చేయకుండా తెలివిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాడు దిల్ రాజు. అందుకే దిల్ రాజుకు గతంలో లాగా స్టార్ హీరోలు కూడా డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. వారు కూడా దూరం జరుగుతున్నారట. దీనికి తోడు కరోనా రాక. ఈ పరిస్థితుల్లో థియేటర్ల నుండి దిల్ రాజు నష్టాలు. ఆ రకంగా కరోనా దిల్ రాజుకు భారీ దెబ్బలానే ఉంది.