Naga Chaitanya : టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరొందిన నాగ చైతన్య, సమంత రెండు రోజుల ముందే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా వీళ్లిద్దరి వివాహం జరిగింది. వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. పెళ్లి కూతురు గా ముస్తాబు అవుతున్న సమయంలో శోభిత దూళిపాళ్ల ఆనందంతో గంతులు వేస్తున్న వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ పెళ్ళికి అక్కినేని, దగ్గుపాటి కుటుంబాలతో పాటు, ఇండస్ట్రీ నుండి చాలా తక్కువ మంది మాత్రమే హాజరు అయ్యినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి అత్యంత సన్నిహితం అనే సంగతి తెలిసిందే. ఆయన కుటుంబం మొత్తం పెళ్ళికి హాజరైనట్టు ఫోటోలు బయటకి వచ్చాయి కానీ, ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు హాజరైనట్టు మాత్రం ఎలాంటి సమాచారం లేదు.
ఇదంతా పక్కన పెడితే పెళ్లైన కొత్తల్లోనే ఈ జంట కలిసి ఒక వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహానికి వీళ్లిద్దరు వస్తున్నారని తెలుసుకొని మీడియా అక్కడికి చేరుకుంది. వాళ్ళు ఈ జంట ని ఫోటోషూట్ ఇవ్వాల్సిందిగా కోరగా, శోభిత అందుకు ఓకే చెప్పి ముందుకు వెళ్తుంది. నాగ చైతన్య ని కూడా తనతో రమ్మని ఆమె చెప్పగా, నాకు ఆసక్తి లేదు, కావాలంటే నువ్వు ఒక్కదానివే ఫోటో షూట్ చేయించుకో అన్నాడట. దీనికి శోభిత దూళిపాళ్ల అసహనం వ్యక్తం చేస్తూ, నాగ చైతన్య పై చిరాకు పడిందని, అందుకు సంబంధించిన ఫోటో ఇదేనంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పోస్టులు చేస్తున్నారు. ఈ పోస్టులపై అక్కినేని అభిమానులు చాలా ఘాటుగా స్పందించారు. భార్య భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న చిర్రుబుర్రు సందర్భాలు ఏర్పడడం సహజం. కేవలం భార్య భర్తల బంధంలోనే కాదు, ఏ బంధంలో అయినా ఇది సర్వ సాధారణం.
వాటిని పట్టుకొచ్చి సోషల్ మీడియా లో ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేయడం సరికాదు అంటూ ఈ సందర్భంగా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై సుమారు 70 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి లిరికల్ వీడియో సాంగ్, గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాగ చైతన్య ఈ చిత్రంతో కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని బలమైన నమ్మకంతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్.