https://oktelugu.com/

Allu Arjun Arrested: అల్లు అర్జున్ ని జైలు నుండి విడిపించేందుకు ఎంత ఖర్చు చేసారో తెలుసా..? ఆ డబ్బులతో ఒక సినిమానే తీసేయొచ్చు!

మెగాస్టార్ చిరంజీవి కి రాజకీయంగా పెద్ద ఎత్తున సర్కిల్ ఉండడం తో ఆయన చెయ్యాల్సిన ఏర్పాట్లు మొత్తం చేసినట్టు సమాచారం. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు చిరంజీవి అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఒకపక్క అల్లు అరవింద్ కి ధైర్యం చెప్తూనే, మరోపక్క లీగల్ గా చెయ్యాల్సిన కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : December 14, 2024 / 09:37 AM IST

    Allu Arjun Arrested(26)

    Follow us on

    Allu Arjun Arrested: నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం లో అల్లు అర్జున్ తో పాటు, ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి పేరు కూడా జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. నాన్ బెయిల్ కేసు పడింది, చాలా బలమైన సెక్షన్లు, అల్లు అర్జున్ కి ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమే అని అభిమానులు సైతం కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి ఆపద్బావందవుడు లాగా వచ్చి, అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాడు. అల్లు అర్జున్ అభిమానులు కూడా నిన్న నిరంజన్ రెడ్డి కి కృతఙ్ఞతలు తెలియచేస్తూ లక్షల సంఖ్యలో ట్వీట్లు వేశారు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే కేవలం నిరంజన్ రెడ్డి మాత్రమే కాదు, అల్లు అర్జున్ విడుదల కోసం చట్టపరంగా వెళ్లేందుకు ఎంతో మంది సహాయ సహకారాలు కూడా అందించారు.

    మెగాస్టార్ చిరంజీవి కి రాజకీయంగా పెద్ద ఎత్తున సర్కిల్ ఉండడం తో ఆయన చెయ్యాల్సిన ఏర్పాట్లు మొత్తం చేసినట్టు సమాచారం. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు చిరంజీవి అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఒకపక్క అల్లు అరవింద్ కి ధైర్యం చెప్తూనే, మరోపక్క లీగల్ గా చెయ్యాల్సిన కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసాడు. నిన్న అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చే వరకు న్యాయపరంగా జరగాల్సిన పనులకు దాదాపుగా కోటి రూపాయలకు పైగానే ఖర్చు అయ్యినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా లాయర్ నిరంజన్ రెడ్డి చిన్నవాడు కాదు. దేశంలోనే టాప్ మోస్ట్ న్యాయవాదుల్లో ఒకరు ఆయన. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఈయన వ్యక్తిగత లాయర్. ఎన్నో క్లిష్టమైన కేసుల్లో జగన్ కి బెయిల్ వచ్చేలా చేసింది ఈయనే. గంటకి ఇతను నాలుగు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. నిన్న ఆయన ఈ కోర్టు ప్రొసీడింగ్స్ కోసం నాలుగు గంటల సమయం తీసుకున్నట్టు తెలిసింది.

    ఈ నాలుగు గంటల కోసం 16 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకున్నట్టు సోషల్ మీడియా లో ఒక కథనం ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఇక మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయడానికి కోటి రూపాయిల వరకు అయ్యిందట. ఈ సెక్షన్ కేసులు సామాన్యుడి పైన పడుంటే కనీసం 5 ఏళ్ళ జైలు శిక్ష పడేది, బెయిల్ కూడా దొరికేది కాదు. అలాంటిది పెద్ద స్థాయి వాళ్ళు ఎంత దూరం వెళ్లారో మీరే చూడండి అంటూ సోషల్ మీడియా లో కొన్ని కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ బెయిల్ కేవలం నాలుగు వారాలకు మాత్రమే వర్తిస్తుంది, అనంతరం రెగ్యులర్ బెయిల్ కావాలంటే నాంపల్లి కోర్టు ని ఆశ్రయించాల్సిందిగా హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ కేసు గొడవ ఇక్కడితో ముగుస్తుందా?, లేదా ఇంకా కొనసాగుతుందా అనేది చూడాలి.