Raja Saab advance bookings: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) మూవీ మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్ తో సహా దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రారంభం అయ్యాయి, ఒక్క తెలంగాణ ప్రాంతం లో తప్ప. మేకర్స్ తెలంగాణ లో టికెట్ హైక్స్, ప్రీమియర్ షోస్ కి అనుమతి కోరుతూ హై కోర్టు ని రెండు రోజుల క్రితం ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే గతం లో ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, గేమ్ చేంజర్’, ‘అఖండ 2’ చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుతూ ఇచ్చిన జీవో ని వెనక్కి తీసుకోవాలంటూ హై కోర్టు ఉత్తర్వులు జారే చేసింది. అలాంటి సమస్య మళ్లీ రాకుండా ఉండడం కోసం, ముందస్తు జాగ్రత్తగా హై కోర్టు ని ఆశ్రయించారు ‘రాజా సాబ్’ మరియు ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ టీమ్స్.
కోర్టు వైపు నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ కాగితం రూపం లో జరగాల్సిన ఫార్మాలిటీలు జరగడం ఆలస్యం అవ్వడం తో ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్రమైన ఫ్రాస్ట్రేషన్ కి గురి అవుతున్నారు. మరో ఆరు గంటల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పటి వరకు బుకింగ్స్ మొదలు పెట్టలేదు. గతం లో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మరోసారి అలాంటి పరిస్థితి ఏ సినిమాకు కూడా రాదనీ అనుకున్నాం కానీ, రాజా సాబ్ కి వచ్చింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తరుపున రావాల్సిన జీవో, కోర్టు తరుపున రావాల్సిన ఆర్డర్స్ మొత్తం వచ్చేశాయని, సాయంత్రం 4 నుండి 6 గంటల లోపు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఆల్ ఇండియా ప్రీమియర్స్ గ్రాస్ ఆరు కోట్ల రూపాయలకు పైగానే ఉందని, కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుండి 5 గ్రాస్ రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. టాప్ 1 రేంజ్ కి ప్రీమియర్స్ గ్రాస్ రావడం ప్రస్తుతానికి కష్టమే కానీ, కచ్చితంగా టాప్ 3 రేంజ్ ప్రీమియర్స్ గ్రాసర్ గా ‘రాజా సాబ్’ నిలిచే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొదటి రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓజీ, హరి హర వీరమల్లు చిత్రాలు ఉన్నాయి. చూడాలి మరి రాజాసాబ్ ప్రీమియర్స్ + మొదటి రోజుకు కలిపి ఎంత గ్రాస్ వసూళ్లను రాబడుతుంది అనేది.