https://oktelugu.com/

70th National Film Awards 2024 : నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన ‘కాంతారా’..ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్!

అలాగే చిన్న స్థాయి నుండి పాన్ ఇండియా లెవెల్ లో తన అద్భుతమైన కొరియోగ్రఫీ తో ఆడియన్స్ ని అలరించిన 'జానీ మాస్టర్' కి కూడా నేషనల్ అవార్డు దక్కడం పై నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2024 / 05:11 PM IST
    70th National Film Awards 2024 winners List Rishab Shetty Best actor

    70th National Film Awards 2024 winners List Rishab Shetty Best actor

    Follow us on

    70th National Film Awards 2024 : కాసేపటి క్రితమే 70 వ నేషనల్ అవార్డ్స్ ని ఢిల్లీ లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్ లో ప్రకటించారు. ఈసారి నేషనల్ అవార్డ్స్ లో కన్నడ చిత్రం ‘కాంతారా’ సత్తా చాటింది. 2022 వ సంవత్సరం లో ఎలాంటి హైప్ లేకుండా, చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. కేవలం మూడు కోట్ల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ తో మొదలైన ఈ చిత్రం 450 కోట్ల రూపాయలకు పైగా రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసే వసూళ్లను రాబట్టింది.

    ఈ చిత్రం లో రిషబ్ శెట్టి కేవలం హీరో గా మాత్రమే కాదు, డైరెక్టర్ గా, రచయితగా కూడా వ్యవహరించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ఆయన చూపించిన అద్భుతమైన నటనకి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అందుకే ఆయన నటనని గుర్తించి భారత దేశ ప్రభుత్వం ఉత్తమ నటుడి క్యాటగిరీ లో రిషబ్ శెట్టి ని ఎంచుకుంది. అంతే కాకుండా కాంతారా చిత్రం ఉత్తమ చిత్రం క్యాటగిరీ లో కూడా నేషనల్ అవార్డు ని సొంతం చేసుకుంది. అలాగే ఉత్తమ నటి క్యాటగిరీ లో ‘తిరుచిత్రంబలం’ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చినందుకు ఆమెకి నేషనల్ అవార్డు దక్కింది. అదే చిత్రం నుండి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి కూడా నేషనల్ అవార్డు దక్కింది. ధనుష్ హీరో గా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా అప్పట్లో తెలుగు, తమిళ భాషల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక తమిళనాడు ప్రేక్షకులు ఎంతో గర్వం గా భావించే ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రానికి ప్రేక్షకులు మైమరచిపోయే రేంజ్ లో మ్యూజిక్ అందించిన ఏ ఆర్ రెహ్మాన్ కి ‘ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ దర్శకుడు క్యాటగిరీ సూరజ్ కి ‘ఉంచాయ్’ చిత్రానికి గాను నేషనల్ అవార్డు దక్కింది.

    అయితే ఈసారి ఒక్క తెలుగు సినిమాకి కూడా నేషనల్ అవార్డు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2021 వ సంవత్సరానికి సంబంధించిన నేషనల్ అవార్డ్స్ కి గాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడి క్యాటగిరీ లో నేషనల్ అవార్డు దక్కిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2022 వ సంవత్సరం లో #RRR చిత్రానికి పలు క్యాటగిరీలలో నేషనల్ అవార్డు దక్కింది. ఇది ఇలా ఉండగా గొప్ప నటిగా ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో కొనసాగుతున్న నిత్యా మీనన్ కి ఎట్టకేలకు నేషనల్ అవార్డు రావడం పై ఆమె అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే చిన్న స్థాయి నుండి పాన్ ఇండియా లెవెల్ లో తన అద్భుతమైన కొరియోగ్రఫీ తో ఆడియన్స్ ని అలరించిన ‘జానీ మాస్టర్’ కి కూడా నేషనల్ అవార్డు దక్కడం పై నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.