Declining language in Politics : నిక్కర్ మంత్రి.. కట్ డ్రాయర్ ఎమ్మెల్యే.. ఏపీలో దిగజారుతున్న భాష!

రాజకీయాల్లో విమర్శలు అనేవి సహజం. అవి హేతుబద్ధంగానే ఉండాలి కానీ.. ప్రజలకు ఆమోదయోద్యం కాని రీతిలో ఉంటే ప్రజాస్వామ్యానికి ముప్పు. ఏపీలో అటువంటి ముప్పు ఇప్పుడు కనిపిస్తోంది.

Written By: Dharma, Updated On : August 16, 2024 5:04 pm

Declining language in Politics

Follow us on

Declining language in Politics : రాజకీయాల్లో విమర్శలు పక్కదారి పడుతున్నాయి. ఇటువంటి తరుణంలో హుందాతనం ఆశించడం అతిశయోక్తి. కానీ తాము ప్రజాక్షేత్రంలో ఉన్నామని నేతలు మరిచిపోతున్నారు.నోరు తెరిస్తే జుగుప్సాకర పదజాలం వాడుతున్నారు. ఇటీవల రాజకీయాల్లో ఈ సంస్కృతి పెరిగింది. మరోవైపు తాము పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా మరింత రెచ్చిపోతోంది. తమ నాయకుడికి మద్దతుగా ప్రచారం చేసుకుంటే పర్వాలేదు. కానీ ప్రత్యర్థిని తక్కువ చేస్తూ.. హేళనగా మాట్లాడుతూ..రాజకీయాలను మరింత దిగజార్చుతున్నారు.ఇక టీవీ డిబేట్లలో, యూట్యూబ్ ఇంటర్వ్యూ లో నేతలు చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. వారు చేస్తున్న కామెంట్స్ పుణ్యమా అని.. టీవీలను సైతం మ్యూట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.అయితే ఇందుకు ముమ్మాటికి రాజకీయ పార్టీల వైఖరి కారణం.ఏపీలో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రెండు బలమైన పార్టీల మధ్య పోరాటంలో భాగంగా.. వ్యక్తిగత వైరం కూడా కొనసాగుతోంది. ప్రజలు సైతం ఆ నేతల అభిమానులుగా మారి కీచులాడుకుంటున్నారు. ప్రజల్లో విభజనకు కూడా రాజకీయ పార్టీలే కారణమవుతున్నాయి. చివరికి వ్యక్తిగత వైరాలు, దాడులు, కేసులకు పురిగొల్పుతున్నాయి. సోషల్ మీడియాలో విచ్చలవిడి ప్రచారమే ప్రధాన కారణం. తాజాగా ఓ వివాదం సోషల్ మీడియాలో రచ్చకు కారణం అవుతోంది. నిక్కర్ మంత్రి అని ఒకరు సంబోధిస్తే.. కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ ఇంకొకరు సంబోధించేసరికి వివాదం ముదిరింది. సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. ప్రజల్లో రాజకీయం అంటేనే చులకన భావం ఏర్పడుతోంది. అయితే ఇందులో అన్ని రాజకీయ పార్టీలు కారణమవుతున్నాయి. అవే బాధితులుగా మిగులుతున్నాయి.

* అన్న క్యాంటీన్లకు విరాళాల పిలుపుతో
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 100 చోట్ల క్యాంటీన్లను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు గుడివాడలో క్యాంటీన్ ప్రారంభించి స్వయంగా వడ్డించారు. మరోవైపు అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి సహకరించాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన వైసిపి ‘ పేదలను రక్షించడానికి విరాళాలు.. నిక్కర్ మంత్రి సరికొత్త స్టేట్మెంట్ ‘ అని ఎక్స్ ఖాతాలో వీడియోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది. దీనిని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ట్రోల్ చేశాయి. చాలా వేగంగా వైరల్ అయ్యింది.

* జగన్ పై అదే రీతి కామెంట్స్
అయితే మంత్రి లోకేష్ పై వైసీపీ కామెంట్స్ తో టిడిపి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కౌంటర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘ ఈ కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్ ఎంత సిగ్గుమాలిన సైకోనో చూడండి. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని ఫ్యామిలీ అది. విరాళం అంటే ఏడుస్తున్నాడు. అన్న క్యాంటీన్ అంటే ఏడుస్తాడు. ఏనాడైనా ఒకరికి పెడితే తెలుస్తుంది. దోచుకుతిని బ్రతికే బ్రతుకులకు ఇలాంటివి ఏం తెలుస్తాయిలే’ అని రియాక్ట్ అయ్యింది. ఈ పోస్టును టిడిపి శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

* ఆందోళనలో ప్రజలు
నిక్కర్ మంత్రి.. కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ దిగజార్చే భాషను స్వయంగా రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు జనాన్ని పరిచయం చేస్తున్నాయి. ఇంకా భాషను ఎంత దిగజార్చుతారో అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ భాష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో లోకేష్ ను వైసీపీ నేతలు పప్పు గాడు, తుప్పు గాడు అని కామెంట్స్ చేసేవారు. ఇప్పుడు నిక్కర్ మంత్రి అని సంభోదిస్తున్నారు. జగన్ ను సైకో, జలగ, వాడు, వీడు అని విమర్శించిన టిడిపి ఇప్పుడు నిక్కర్ ఎమ్మెల్యేగా చెబుతోంది. ఈ దిగజారుడు రాతలతో మరింత దిగజారుతుండడం విచారకరం.