7/g brundavan Colony Re Release: సినిమాల్లేక థియేటర్లు ఖాళీగా ఉంటున్న సమయంలో కొందరు నిర్మాతలు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో బంపర్ హిట్టు సాధించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే పవన్ కల్యాణ్ సినిమా ‘తొలిప్రేమ’, బాలకృష్ణ ‘నరసింహానాయుడు’ సినిమాలను రిలీజ్ చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలే కాకుండా చిన్న సినిమాల అయిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాను రి రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా 2004లో సూపర్ హిట్టు కొట్టిన మరో సినిమాలు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో థియేటర్లలో మరోసారి పండుగ వాతావరణం నెలకొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కరోనా తరువాత ఓటీటీల హవా పెరిగిపోయింది. దీంతో చాలా మంది థియేటర్లో చూసే సినిమాలన్నీ ఓటీటీలో చూస్తన్నారు. ఈ క్రమంలో థియేటర్లలోకి జనాలు రావడం లేదు. దీంతో గతంలో హిట్టుకొట్టిన సినిమాలను రిలీజ్ చేస్తూ థియేటర్ల వద్ద సందడి సృష్టిస్తున్నారు. 2004లో రిలీజ్ అయిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ మూవీ ‘7/G బృందావన్ కాలనీ’ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రవికృష్ణ, సోనీ అగర్వాల్ జంటగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. తెలుగు, తమిళంలోనూ బంపర్ హిట్టు కొట్టినీ ఈ మూవీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది.
లవ్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా కామెడీ కూడా ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సుమన్ శెట్టి చేసిన కామెడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. అంతేకాకుండా ఆయన ఈ సినిమాతోనే పాపులర్ అయ్యాడు కూడా. ఇక ఈ సినిమాకు మరో ఎక్విప్మెంట్ మ్యూజిక్. యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుంది. దీంతో ఈ సినిమా అన్ని కోణాల్లోనూ మెప్పించింది. ఇక ఈ మూవీని సీక్వెల్ తీస్తారని ఇటీవల ప్రచారం జోరందుకుంది. దీంతో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ తరుణంలో ‘7/G బృందావన్ కాలనీ’ నే రి రిలీజ్ చేస్తుండడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే లేటేస్టుగా ఈ మూవీని 4Kలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు తేదీని ప్రకటించలేదు. మరికొన్ని రోజుల్లోనే ఆ తేదీని డిక్లేర్ చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. దీంతో మరోసారి ‘7/G బృందావన్ కాలనీ’ థియేటర్లో సందడి చేయనుంది. అయితే ఈసారి ప్రేక్షకాదరణ ఎలా ఉంటుందో చూడాలి.