Amma Rajasekhar: బిగ్ బాస్ ఫేమ్ అమ్మ రాజశేఖర్ కి కొరియోగ్రాఫర్ గా మంచి పేరు ఉంది. ఓ దశలో అమ్మ రాజశేఖర్ కొరియోగ్రఫీ కోసం స్టార్ హీరోలు ఎదురుచూశారు. అలాంటి స్టేజ్ లో అమ్మ రాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా మానుకుని దర్శకత్వం పై ఆసక్తి పెంచుకుని.. కొన్ని సినిమాలకు డైరెక్షన్ చేశారు. ఇంతకీ అమ్మ రాజశేఖర్ ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు ? ఆయన చేసిన సినిమాల్లో ఎన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఎన్ని ప్లాప్ అయ్యాయో ? తెలుసుకుందాం.
అమ్మ రాజశేఖర్ మొత్తం ఆరు సినిమాలు చేశారు. మొదటి సినిమా రణం సూపర్ హిట్ అయ్యింది. అయితే, ఆ తర్వాత ఆయన తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ గానే మిగిలింది.
1. రణం : బ్లాక్ బస్టర్:
అమ్మ రాజశేఖర్ 2006లో.. గోపిచంద్ హీరోగా కామ్నాజఠ్మలానీ హీరోయిన్ గా రణం సినిమా చేశారు. ఈ సినిమాకు ఆయన చేసిన కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్, సాంగ్స్ అన్నీ బాగా కుదిరాయి. దాంతో, ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ గా అమ్మ రాజశేఖర్ మంచి పేరు తెచ్చుకున్నారు.
Also Read: Triple Role Heros In Tollywood: సినీ చరిత్రలో త్రిపుల్ రోల్ చేసిన 6 స్టార్లు వీళ్లే
2. ఖతర్నాక్ -ఫ్లాప్ :
రణం హిట్ అవ్వడంతో 2006 లో రవితేజ, ఇలియానా హీరోహీరోయిన్లుగా అమ్మ రాజశేఖర్ ఖతర్నాక్ అనే సినిమా చేశారు. ఈ ఖతర్నాక్ చిత్రం ప్లాప్ అయ్యింది. యాక్షన్ జోనర్ లో చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దాంతో అమ్మ రాజశేఖర్ కి రణంతో వచ్చిన పేరు కాస్త పోయింది.
3. టక్కరి – ఫ్లాప్:
నితిన్, సదాలను హీరోహారోయిన్లుగా పెట్టి అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన మూడో సినిమా ‘టక్కరి’. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
4. బీభత్సం- యావరేజ్ :
శశాంక్, మధుశర్మలను హీరోహీరోయిన్లుగా అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన నాలుగో చిత్రం ‘బీభత్సం’ . విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది గాని.. డబ్బులు అయితే తెచ్చుకోలేకపోయింది.
5. మ్యాంగో- ఫ్లాప్:
అమ్మ రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత 2013లో కృష్ణుడిని హీరోగా పెట్టి తీసిన మ్యాంగో సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ పై అందరికి నమ్మకం పోయింది.
6. రణం-2- ఫ్లాప్:
ఇక చివరిసారిగా అమ్మ రాజశేఖర్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా ‘రణం-2’. 2015లో శ్రీహరి, ఆర్తి అగర్వాల్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. రణం లాగా హిట్ కొట్టాలని రణం 2 తీస్తే.. అమ్మ రాజశేఖర్ కి భారీ నష్టాలను తెచ్చి పెట్టింది. ఇక అప్పటి నుంచి అమ్మ రాజశేఖర్ చిత్రసీమకు ముఖ్యంగా డైరెక్షన్ కి దూరంగా ఉండిపోయారు.
Also Read: AP New Districts: ప్రభుత్వ పంతం.. కొత్త జిల్లాలకు తుది రూపం