https://oktelugu.com/

Telangana Cabinet Expansion: కేసీఆర్‌ కుటుంబంలో మరో నిరుద్యోగికి ఉద్యోగం!

Telangana Cabinet Expansion: తెలంగాణ క్యాబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు వేళయింది. ఇప్పటికే క్యాబినెట్‌ లో కొత్తవారికి చోటు కల్పించాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదాపడుతూ వస్తోంది. శాసన సభ సమావేశాలు, యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు పూర్తి కావడంతో ఉగాది తర్వాత అంటే ఏప్రిల్‌ మొదటి వారంలో లేదా రెండో వారంలోనో తెలంగాణ మంత్రవర్గంలో మార్పులకు సీఎం చంద్రశేఖర్‌ రావు శ్రీకారం చుట్టొచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న మంత్రి వర్గంలో ఐదుగురికి ఉద్వాసన పలికి ఆ […]

Written By: , Updated On : April 1, 2022 / 12:33 PM IST
Follow us on

Telangana Cabinet Expansion: తెలంగాణ క్యాబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు వేళయింది. ఇప్పటికే క్యాబినెట్‌ లో కొత్తవారికి చోటు కల్పించాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదాపడుతూ వస్తోంది. శాసన సభ సమావేశాలు, యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు పూర్తి కావడంతో ఉగాది తర్వాత అంటే ఏప్రిల్‌ మొదటి వారంలో లేదా రెండో వారంలోనో తెలంగాణ మంత్రవర్గంలో మార్పులకు సీఎం చంద్రశేఖర్‌ రావు శ్రీకారం చుట్టొచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న మంత్రి వర్గంలో ఐదుగురికి ఉద్వాసన పలికి ఆ స్థానాల్లో ఐదుగురు కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పించేందుకు సీఎం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Telangana Cabinet Expansion

KCR

వాయిదాకు కారణాలు అనేకం..
సీఎం చంద్రశేఖర్‌రావు ఏదీ చెప్పి చేయరు. ముహూర్తం ప్రకారం కూడా పెద్దగా అడుగులు వేయరు. ఎవరైనా చెప్పారనో, ఒత్తిడి తెచ్చారనో ఆ పని చేయరు. తనకు వీలైనప్పుడు, చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. తెలంగాణ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ కూడా అదే విధంగా జరగబోతోంది. తెలంగాణ క్యాబినెట్‌ కూర్పు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నపటికి అనేక కారణాలవల్ల వాయిదా పడుతూవస్తోంది. ఆశావహులు మాత్రం తెలంగాణ భవన్, ప్రగతి భవన్‌ చుట్టూ ప్రదక్షిణలు కొనసాగిస్తున్నారు. మరికొంత మంది ఎర్రవల్లి ఫాంహౌస్‌ కు సైతం రూట్‌ మార్చినట్టు తెలుస్తోంది.

Also Read: Amma Rajasekhar: అమ్మ రాజ‌శేఖ‌ర్ డైరెక్ట్ చేసిన 6 సినిమాల్లో ఎన్ని హిట్టు ? ఎన్ని ప్లాప్ ?

అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కూర్పు..
తెలంగాణ క్యాబినెట్‌ విçస్తరణకు సీఎం చంద్రశేఖర్‌రావు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఉగాది తర్వాత క్యాబినెట్‌ కూర్పును చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసనపలికే అవకావం ఉందిని తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొంత మంది మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాల్సి ఉందని, ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్ధాయిలో ప్రజలకు వివరంచడంలో విఫలం చెందుతున్నారని సీఎం చంద్రశేఖర్‌రావు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఐనప్పటికీ సీఎం హెచ్చరికలను పెడచెవిన పెట్టిన మంత్రులకు ఉద్వాసన తప్పదనే చర్చ జరుగుతోంది.

Kavitha

mlc kavitha

అన్ని సామాజికవర్గాలను సంతృప్తి పరిచేలా..
ఉత్తర తెలంగాణ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు, దక్షిణ తెలంగాణ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో చా¯Œ ్స దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా నగరానికి సంబందించిన ఓ మంత్రికి కూడా ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఉద్వాసన పలికే మంత్రుల స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను తిరిగి మంత్రులుగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా ప్రతీ వర్గానికి గుర్తింపునిచ్చే విధంగా మంత్రివర్గ కూర్పు చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ కూర్పులో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read:  AP New Districts: ప్రభుత్వ పంతం.. కొత్త జిల్లాలకు తుది రూపం
.

Tags