Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 63 ఉద్యోగ ఖాళీల కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 26 ఉండగా ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 37 ఉన్నాయని సమాచారం అందుతోంది.

బీఈ, బీటెక్, బీఎస్సీ పాసైన వాళ్లు ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలకు 32 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ విధానంలో ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: Pushp Box Office Collection: ‘పుష్ప’ రికార్డుల వేట మాత్రం ఆపడం లేదు
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు ఘజియాబాద్‌లోని బీఈఎల్ యూనిట్‌లో పని చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. https://bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
Also Read: Governor Invites KCR: కేసీఆర్‌కు గవర్నర్ ఆహ్వానం.. ఈ ఛాన్స్‌ను వినియోగించుకుంటారా…?