Akira Nandan film debut: టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ డెబ్యూ మూవీస్ లో ఒకటి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొడుకు అకిరా నందన్(Akira Nandan) మొదటి చిత్రం. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా అకిరా మొదటి సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎంతైనా పవర్ స్టార్ కొడుకు కదా, ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది. అయితే అకిరా నందన్ కి మొదటి నుండి నటనపై ఆసక్తి లేదని, వాడికి మ్యూజిక్ మీద అమితాసక్తి ఉందని, అకిరా తల్లి రేణు దేశాయ్ ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది. టాలీవుడ్ హీరోలందరూ షాక్ కి గురయ్యే రేంజ్ కటౌట్ పెట్టుకొని, హీరో గా కాకుండా, మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడుతాడా?, ఇందుకు మేము అసలు ఒప్పుకోము అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ పెద్ద రచ్చ నే చేశారు.
Also Read: మొన్న నిధి అగర్వాల్..నిన్న సమంత..నేడు అల్లు స్నేహా..లేడీ సెలబ్రిటీలకు రక్షణ కొరవు!
అయితే రీసెంట్ గానే అకిరా తల్లి రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో విలేఖరి ఒక ప్రశ్న అడుగుతూ ‘అకిరా ని చూసిన ప్రతీ ఒక్కరు అడిగే మొదటి ప్రశ్న సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అని. మరి ఎప్పుడొస్తాడో చెప్పగలరా?’ అని రేణు దేశాయ్ ని అడగ్గా, అందుకు ఆమె సమాధానం చెప్తూ ‘ప్రతీ ఇంటర్వ్యూ లో నేను ఇది చెప్తూనే ఉన్నాను. వాడు ఇండస్ట్రీ లోకి రావాలని మీలాగే నేను కూడా కోరుకుంటున్నాను. అందుకోసం ప్రతీ రోజు నేను దేవుడికి మొక్కుతూ కొబ్బరి కాయ కొడుతున్నాను’ అని చెప్పుకొచ్చింది. ‘అసలు సినిమాల్లోకి వచ్చే ఆసక్తి అతనికి ఉందా’ అని యాంకర్ అడగ్గా, ‘అసలు ఈ టాపిక్ నా దగ్గరకి తీసుకొని రాకు అమ్మా అని అనేవాడు’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. అంటే అకిరా కి నిజంగానే సినిమాల పై ఆసక్తి లేదా?, ఇంత అందమైన కుర్రాడు, హాలీవుడ్ హీరో రేంజ్ కటౌట్, సినిమాల్లోకి రాకపోతే ఎలా అని అభిమానులు అనుకుంటున్నారు.
Also Read:అనసూయ, మాజీ మంత్రి రోజా పై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డ హీరోయిన్ రాశీ..వీడియో వైరల్!
ఇదే ఇంటర్వ్యూ లో రేణు దేశాయ్ మాట్లాడుతూ ‘వాడికి కొంత సమయం కావాలి..ప్రస్తుతం ఎటు వైపు వెళ్ళాలి అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే మ్యూజిక్ నేర్చుకున్న అకిరా నందన్, ప్రస్తుతం యాక్టింగ్ కూడా నేర్చుకుంటున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా ఆయన ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచారట. అంతే కాకుండా కొన్ని కథలు కూడా పవన్ కళ్యాణ్ విన్నాడని, అకిరా నందన్ మొదటి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఉండే అవకాశాలు ఉన్నాయనే రూమర్స్ కూడా సోషల్ మీడియా లో బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరగబోతుందో.