Yellamma Movie Glimpse: ‘బలగం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న దర్శకుడు వేణు ఎల్దండి… తెలంగాణ ప్రాంతంలో ఈ సినిమాకి దక్కిన ఆదరణ మరే సినిమాకి దక్కలేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కుటుంబ బాంధవ్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడి చేత కన్నీళ్లు పెట్టించింది. మరి అలాంటి సినిమాను చేసిన వేణు గత రెండు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నాడు. ఎల్లమ్మ సినిమా కథ ఎప్పుడో ఫైనల్ అయినప్పటికి హీరోల విషయంలో మాత్రం ఆయన చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాడు. ఈ సినిమా కోసం చాలామంది స్టార్ హీరోల పేర్లు వినిపించినప్పటికి అవేవి వర్కౌట్ కాలేదు. దాంతో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ను హీరో గా పెట్టి ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ షూట్ కూడా రెడీ అయిపోయింది.
వీలైనంత తొందరగా ఈ సినిమాగ్లింప్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా థీమ్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే సినిమాకి సెట్ అవుతాడా? దేవి శ్రీ ప్రసాద్ మొదటి సినిమా కావడం వల్ల అతన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వేణు ఎల్దండి ఎందుకని దేవి శ్రీ ప్రసాద్ ని తీసుకున్నాడు అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికైతే ఈ సినిమాతో వేణు మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… వేణు హీరో ఎవరైనా కూడా తన కంటెంట్ ను మార్చే ప్రసక్తే లేదు అని ఖరాఖండి గా చెప్పేస్తున్నాడు.
తను ఏదైతే రాసుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దేవిశ్రీప్రసాద్ అయితేనే తను చెప్పినట్టుగా వింటాడనే ఉద్దేశ్యంతో తనను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా ప్రేక్షకుల్లో వేణు ఎలాంటి ఐడెంటిటి సంపాదించుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…