ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను టాలీవుడ్ హీరోయిన్ రకుల్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ లో ముగ్గురు హీరోయిన్లు తమ అందాలను ఆరబోశారని చెప్పాలి. ముఖ్యంగా ఆర్‌ఎక్స్ 100 భామ పాయల్ రచ్చ చేసింది. తెలుగులో మొదటిసారిగా ముగ్గురు హీరోయిన్స్ కలిసి నటిస్తోన్న తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. కాగా ఈ వెబ్ సిరీస్ నవంబర్ 12 నుంచి ఆహాలో ప్రసారం కానుంది.
ఈ వెబ్ సిరీస్ లో పాపం, ప్రేమ, పెళ్లి మోహంలో ఏది సరైన దారో తెలియక తికమక పడుతున్న అమ్మాయిల లాగా వీరు నటిస్తున్నారు. ఈషా రెబ్బాను రీతూగా, పాయల్ ను జాహ్నవీగా… పూర్ణాను ఇందుగా నటిస్తున్నారు. ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి ఫ్రస్ట్రేషన్‌లో రీతూ, వయస్సు మీద పడుతున్నా పెళ్లి చేసుకోడానికి తగిన జోడీ దొరక్క బాధపడుతున్న అమ్మాయిగా ఇందు … పెళ్లికి ముందే అబ్బాయిలతో అడ్వాన్స్‌గా ఉండే జాహ్నవీల జీవితాల్లో ఏం జరిగిందనేది ‘3 రోజెస్’ కథనంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.