https://oktelugu.com/

Jabardasth Comedians: జబర్దస్త్ కు రాకముందు ఈ కమెడియన్లు ఏం చేసేవారో తెలుసా..?

Jabardasth Comedians: సినిమాల్లో మాత్రమే కనిపించే కామెడీ బుల్లితెరపై కూడా కమెడియన్లు తమ ఫర్ఫామెన్స్ చూపిస్తున్నారు. అందుకు జబర్దస్త్ కార్యక్రమం వేదికగా మారింది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎందరో కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత వీరు సినిమాల్లో కూడా నటించారు. తమ నటనతో బుల్లతెర ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాలు మాత్రమే చూసేవాళ్లు ఇప్పుడు టీవీ ముందు అతుక్కుపోతున్నారు. జబర్దస్త్ కార్యక్రమం విజయవంతం కావడానికి కొందరు కమెడియన్ కృషి ఎంతో ఉంది. వారిలో చమ్మక్ చంద్ర, సుడిగాలి […]

Written By: , Updated On : November 11, 2021 / 12:21 PM IST
Follow us on

Jabardasth Comedians: సినిమాల్లో మాత్రమే కనిపించే కామెడీ బుల్లితెరపై కూడా కమెడియన్లు తమ ఫర్ఫామెన్స్ చూపిస్తున్నారు. అందుకు జబర్దస్త్ కార్యక్రమం వేదికగా మారింది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎందరో కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత వీరు సినిమాల్లో కూడా నటించారు. తమ నటనతో బుల్లతెర ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాలు మాత్రమే చూసేవాళ్లు ఇప్పుడు టీవీ ముందు అతుక్కుపోతున్నారు. జబర్దస్త్ కార్యక్రమం విజయవంతం కావడానికి కొందరు కమెడియన్ కృషి ఎంతో ఉంది. వారిలో చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, చెలాకి చంటీ తదితరులు తమ నటనతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ లోకి తీసుకెళ్లారు. అయితే వీరంతా జబర్దస్త్ రాకముందు ఏం చేసేవారు..?వారికి ఆదాయం ఎలా వచ్చింది..? అనే చర్చ సాగుతోంది.

 

Jabardasth Comedians

Chammak Chandra Profession

చమ్మక్ చంద్ర: జబర్దస్త్ ప్రముఖ కమెడియన్లలో చమ్మక్ చంద్ర ఒకరు. ఫ్యామిలీ స్కిట్లు ఎక్కువగా చేసి నవ్వించే చమ్మక్ చంద్ర కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. అయితే ఈయన జబర్దస్త్ కు రాకముందు రోజూ కూలీ. ప్రతీ రోజూ ఏదో ఒక పనిచేసి పూట గడుపుకునేవారు. అయతే కొందరు టీచర్ గా పనిచేశాడని అంటున్నారు. ఇప్పడు జబర్దస్త్ లోకి వచ్చిన తరువాత ఆయన దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటారని అంటున్నారు.

Jabardasth Comedians

Sudigaali Sudheer Profession

సుడిగాలి సుధీర్: రామోజీ ఫిలిం సిటీలో మెజిసియన్ గా పనిచేసేవారు సుడిగాలి సుధీర్. డైలీ వేవ్ తోనే ఆయన జీవితాన్ని కొనసాగించేవారు. అయితే తన ఫర్ఫామెన్స్ మెచ్చి మల్లెమాల ప్రొడక్షన్ జబర్దస్త్ లో అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన టాప్ కమెడియన్లలో ఒకరయ్యారు. లవ్ స్కిట్లు చేయడంలో సుడిగాలి సుధీర్ ది ప్రత్యేకత. అంతేకాకుండా ఈయన ఓ సినిమాలో హీరోగా కూడా నటించారు.

Jabardasth Comedians

Jabardasth Adhire Abhi Profession

అదిరే అభి: సాఫ్ట్ వేర్ జీవితాన్ని వదిలి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాడు అదిరే అభి. అంతకుముందే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఈయన తన ఉద్యోగాన్ని వదిలి ఇందులోకి వచ్చాడు. ప్రస్తుతం టీం లీడర్ గా ఉంటూ మంచి మంచి స్కిట్లు చేస్తున్నాడు. అయితే సినిమాల కోసం ఎదురుచూస్తున్నా అవకాశం రావడం లేదు.

Jabardasth Comedians

Hyper Aadi Profession

హైపర్ ఆది: హైపర్ ఆది ఒకప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తూ జీవనం సాగించాడు. ఈయన జబర్దస్త్ లోకి రాకముందు ఆయన జీవితం దారుణంగా ఉండేది. కానీ ఇప్పుడు మంచి పోజిషన్లో ఉన్నాడు.

Also Read: ETV Jabardasth: ఈ జబర్దస్త్ కమెడియన్ల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఇక రాకెట్ రాఘవ సినిమాల్లో స్క్రిప్టు రైటర్ గా.. చెలాకీ చంటీ ఎఫ్ఎం రేడియో జాకీగా పనిచేశారు. ఇక ముక్కు అవినాశ్ కీ బాయ్ గా పనిచేశాడు. అయితే వీళ్లందా జబర్దస్త్ కుటుంబంలో సభ్యులయ్యారు. తమ కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ వారూ సక్సెస్ లైఫ్ ను కొనసాగిస్తున్నారు.