Director Shankar: RRR సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రపంచవాప్తంగా అన్నీ బాషలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న రామ్ చరణ్..తన తదుపరి చిత్రాన్ని సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికే చాలా వరుకు షూటింగ్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమాకి ‘సర్కారోడు’,’సిటిజెన్’ అనే టైటిల్స్ ని పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు..ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు ఈ సినిమాని 50 వ చిత్రం గా తన నిర్మాణ సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు..రామ్ చరణ్ ఈ సినిమాలో IAS ఆఫీసర్ గా మరియు రాజకీయ నాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తుండగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది..ఇక వరుసగా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో ఇండస్ట్రీ హిట్టు మీద హిట్టు కొడుతున్న థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా సునీల్, అంజలి, జయరాం మరియు SJ సూర్య వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: SS Rajamouli: రాజమౌళి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?
ఇది ఇలా ఉండగా శంకర్ తన సినిమాకి క్వాలిటీ విస్జయం లో అసలు వెనుకాడడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ప్రతి షాట్ ని ఆయన ఎంతో రిచ్ తియ్యాలనుకుంటాడు..మరీ ముఖ్యంగా ఆయన సినిమాలో పాటలు సినిమాకి సగం బడ్జెట్ లా ఉంటుంది..ఆయన మొదటి సినిమా నుండి పాటల విషయం లో ‘తగ్గేదెలా’ అనే విధంగా దూసుకుపోతూ వస్తున్నాడు..ఈ సినిమాలో కూడా శంకర్ మార్క్ లోనే పాటలను చిత్రీకరించాడట..దీనికి భారీ స్థాయిలోనే ఖర్చు చేసినట్టు తెలుస్తుంది..ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త అందరిని షాక్ కి గురి చేస్తుంది..అదేమిటి అంటే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని అతి త్వరలోనే విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట..ఆ ఫస్ట్ లుక్ ని ప్రత్యేకంగా షూట్ చేయబోతున్నారట..ఇందుకోసం ఆకధరల మూడు కోట్ల రూపాయిల ఖర్చు చెయ్యబోతున్నట్టు సమాచారం..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది..ఇప్పటికే ఈ సినిమా కోసం దిల్ రాజు దాదాపుగా 140 కోట్ల రూపాయిలను ఖర్చు చేసాడట..సినిమా మొత్తం పూర్తి అయ్యేసరికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో అని భయపడిపోతున్నాడట దిల్ రాజు.

Also Read: BJP vs TRS: కారులో కంగారెందుకు.. ప్రజావ్యతిరేకత ఫ్లెక్సీలతో కప్పేస్తున్నారా?
Recommended Videos